కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురి దుర్మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. కాట్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ప్రతి రోజూ జమ్మూ నుంచి కాట్రాకు సమీపంలోని వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీసులు తిరుగుతుంటాయి.
అందులో భాగంగానే సోమవారం కూడా హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఐదుగురు ప్రయాణికులు వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరగా అది కాట్రాకు సమీపంలో కుప్పకూలింది. దీంతో సిబ్బందితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత మరోసారి ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది.