‘ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్యక్తి మోదీనే’ | Sakshi
Sakshi News home page

‘ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్యక్తి మోదీనే’

Published Mon, Mar 20 2017 4:16 PM

‘ఆ జ్యోతిష్యుడు చెప్పిన వ్యక్తి మోదీనే’ - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లగల వ్యక్తి తూర్పు ప్రాంతంలో జన్మిస్తారని ఫ్రాన్స్‌ దేశానికి చెందిన జ్యోతిష్యశాస్త్రవేత్త నోస్ట్రాడామస్‌ అప్పట్లోనే చెప్పారని, ఆ వ్యక్తి మరెవరో కాదని, ప్రధాని నరేంద్రమోదీనేనని బీజేపీ నేత, లోక్‌సభ సభ్యుడు కిరిత్‌ సోమయ్య చెప్పారు. సోమవారం లోక్‌సభలో గ్రాంటులకోసం సప్లిమెంటరీ డిమాండ్స్‌పై మాట్లాడే సందర్భంలో ఆయన ఈ విషయం చెప్పారు. ‘తూర్పు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడని, అతడే భారతదేశాన్నిసరికొత్త అత్యున్నత శిఖరాలకు చేరుస్తారని నోస్ట్రాడామస్‌ అనాడే చెప్పారు. ఆయన చెప్పిన వ్యక్తి ఎవరో కాదు.. ప్రధాని నరేంద్రమోదీనే’ అని ఆయన అన్నారు.

మరోపక్క, ప్రతిపక్షాలు ఏ చర్చ తీసుకొచ్చినా అందులోకి పెద్ద నోట్ల రద్దు విషయాన్ని తీసుకొచ్చి వితండవాదం చేస్తున్నారని ఆరోపించారు. నోస్ట్రాడామస్‌ ఫ్రాన్స్‌ దేశానికి చెందిన జ్యోతిష శాస్త్రవేత్త. 1547 సంవత్సరం ప్రాంతంలో ఆయన భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. ఆయన జోస్యాలతో కూడిన గ్రంథం పేరు సెంచరీస్‌. ఆ గ్రంథంలో ఆయన చెప్పినవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయని అందరూ విశ్వసిస్తుంటారు. హిట్లర్‌ గురించి, 2001లో అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడి గురించి ఆయన ముందే చెప్పారని అంటుంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement