బలపరీక్షకు కరుణానిధి దూరం!
చెన్నై: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి (92) కాసేపట్లో జరిగే బలపరీక్షకు దూరంగా ఉండనున్నట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా కరుణ అసెంబ్లీకి రారని, బలపరీక్షలో పాల్గొనబోరని డీఎంకే వర్గాలు తెలిపాయి. ఇటీవల అస్వస్థతకు గురైన కరుణానిధి కొన్ని రోజులు చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.
డీఎంకేకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కరుణ మినహా మిగతా 88 మంది ఎమ్మెల్యేలు.. బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయనున్నారు. ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొంటారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది.
మరిన్ని తమిళనాడు విశేషాలు..
భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు
పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
ఎవరీ సైనైడ్ మల్లిక!
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
అమ్మకు ఓటేయండి
నన్ను చూసి నవ్వొద్దు
‘మ్యాజిక్’ చేసేదెవరు?