ఎవరీ పళనిస్వామి..?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు జైలుశిక్ష పడటంతో ఆమెకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఫ్యాక్స్ ద్వారా గవర్నర్కు ఈ విషయం తెలియజేశారు. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు గవర్నర్ అవకాశం ఇస్తారా లేదా ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామిని ఆహ్వానిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. పళనిస్వామి గురించి తెలుసుకోవాలంటే..
- పన్నీరు సెల్వం కేబినెట్లో పళనిస్వామి సీనియర్ మంత్రి. రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రి. సేలం జిల్లాలోని ఎడపాడి నియోజవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- ఎడపాడి నియోజకవర్గం నుంచి పళనిస్వామి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
- జయలలిత బతికున్నరోజుల్లో ఆమెకు వీరవిధేయుడిగా పళనిస్వామి ఉండేవారు. అలాగే చిన్నమ్మ శశికళకు కూడా నమ్మినబంటు.
- జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినపుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీరు సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. శశికళ.. పళనిస్వామినే ముఖ్యమంత్రిని చేయాలని భావించినట్టు సమాచారం. అయితే అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీరు సెల్వం సీఎం పగ్గాలు చేపట్టారు.
- ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అంటే పళనిస్వామికి పడదు.
- అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికయ్యాక పన్నీరు సెల్వం తిరుగుబాటు చేశాక పళనిస్వామి చిన్నమ్మకు మద్దతుగా నిలిచారు.
-
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి పేరు తెరపైకి వచ్చింది.
శశికళ కేసు.. మరిన్ని కథనాలు