ఈ రోజే గవర్నర్ నిర్ణయం.. తమిళనాట ఉత్కంఠ
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు (గురువారం) ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన శశికళ విధేయుడు పళనిస్వామిని ఆహ్వానిస్తారని భావిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం తమిళనాట సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
నిన్న (బుధవారం) తొలుత పళనిస్వామి, ఆ తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఇద్దరూ గవర్నర్‌తో సమావేశమయ్యారు. తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారి సంతకాలతో కూడిన లేఖను పళనిస్వామి గవర్నర్‌కు అందజేయగా, తనకు 11 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని పన్నీరు సెల్వం గవర్నర్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా అవకాశం ఇవ్వాలని ఇద్దరూ గవర్నర్‌ను కోరారు. దీంతో సంఖ్యారీత్యా పళనిస్వామికి ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున గవర్నర్ ఆయన్నే ఆహ్వానిస్తారని విశ్వసనీయ సమాచారం. శశికళ కేసులో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించినందువల్ల గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలని రాజకీయనాయకులు, న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్నా డీఎంకే రాజకీయాలు ఊహించని, అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీంతో అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ స్థానంలో ఆమెకు విధేయుడైన పళనిస్వామిని ఎన్నుకున్నారు. మరోవైపు శశికళపై తిరుగుబాటు చేసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఎంపీలు, ప్రజల మద్దతు లభిస్తున్నా.. ఆయన ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రావడం లేదు.
తమిళనాడు రాజకీయ పరిణామాలు చదవండి
పళనిస్వామికే చాన్స్.. గవర్నర్ పిలుపు!
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం
శశికళ జైలు జీవితం ఎలా ఉంటుందంటే..
‘అమ్మ’ సమాధిపై శశికళ శపథం
లొంగిపోయిన చిన్నమ్మ
వీడని ఉత్కంఠ
ఇక అమ్మ ఫొటో కనిపించదా
పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ
ఆచితూచి అడుగులు
మద్దతు కాదు కృతజ్ఞతే!