అమెరికాలో తెలుగు విద్యార్థి కాల్చివేత
హైదరాబాద్: ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. జాతి వివక్ష చర్యల్లో భాగంగానే ఈ హత్య జరిగిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
వరంగల్ జిల్లాకు చెందిన వంశీ మామిడాల అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఎంస్ పూర్తిచేశాడు. శాన్‌ఫ్రాన్సిస్‌కో లోని ఓ స్టోర్లో పనిచేస్తున్న వంశీ.. గత రాత్రి విధులు ముగించుకొని తన గదికి తిరిగివస్తుండగా హత్యకు గురయ్యాడు. డ్రగ్స్ వాడిన ఓ తెల్లజాతి వ్యక్తి వంశీపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.