రజనీ సినిమాపై జస్ట్ జోక్ చేశాను!
‘కబాలి’ సినిమా పోస్టర్‌పై తాను చేసిన ఆరోపణలపై తాజాగా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ వివరణ ఇచ్చాడు. ‘కబాలి’ పోస్టర్, తన కొత్త సినిమా ‘మదారి’ పోస్టర్ ఒకే తరహాలో ఉండటంతో తాను సరదా జోక్ మాత్రమే వేశానని, అంతేకానీ రజనీకాంత్ తానేమీ అనలేదని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌లో రజనీకాంత్ అభిమానులు విడుదల చేసిన ‘కబాలి’ పోస్టర్.. అచ్చుగుద్దినట్టు ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ చిత్రం పోస్టర్‌లాగా ఉండటంపై ఇర్ఫాన్ ఖాన్ స్పందించిన సంగతి తెలిసిందే. తమది చిన్న సినిమా అయినా, తమ సినిమా పోస్టర్‌ను దొంగలించి కబాలి కోసం వాడుకున్నారని ఆయన మంగళవారం విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇస్తూ ‘రజనీకాంత్‌ను ఒక నటుడిగా, వ్యక్తిగా గౌరవిస్తాను. పోస్టర్ గురించి నేను చేసిన వ్యాఖ్యలు జోక్ మాత్రమే. ఆ పోస్టర్ రజనీ అభిమానులు రూపొందించేదేనని నేను కూడా చెప్పాను’అని ఇర్ఫాన్ అన్నారు.
రెండు పోస్టర్లలోనూ ప్రధాన నటుల ముఖాలతోపాటు అడ్డు వరుసలో ఉన్న భవనాలను చూపించారు. అయితే ఈ వివాదంపై రజనీకాంత్ అభిమానులు స్పందించారు. ఇది సినిమా అధికారిక పోస్టర్ కాదని, దీనిని అభిమానులు రూపొందించి ఆన్‌లైన్ లో విడుదల చేసి ఉంటారని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ‘కబాలి’ పోస్టర్లు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.