మీరు చస్తే.. పాక్‌లో సమాధి చేస్తారా?
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం పట్ల సంబరాలు జరిపిన కశ్మీరీ వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఫరూఖ్ పేరును ప్రస్తావించనప్పటికీ ఆయనను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత కుమార్ విశ్వాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ పరాజయం పట్ల సంబరాలు చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కశ్మీర్ వరదల సమయంలో భారత ఆర్మీ వల్ల ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు నేడు భారత పరాజయంపై సంబరాలు చేసుకుంటున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాంటివాళ్లకు మాతృభూమి పట్ల ఏమాత్రమైన వీధేయత ఉందా? అని ప్రశ్నించారు. ఇలా సంబరాలు చేసుకునేవారు చనిపోయిన తర్వాత తమ మృతదేహాలు పాకిస్థాన్‌లో సమాధి చేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
వేర్పాటువాద నేత ఫరూఖ్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సైతంగా తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఫరూఖ్ పాకిస్థాన్ వెళ్లిపోవాలని, ఇందుకు తాను సహకరిస్తానని ఘాటుగా పేర్కొన్నారు.