-
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్‌గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్‌సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్‌కుమార్‌ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్‌ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్‌లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు. -
PM Narendra Modi: అవినీతికి మారుపేరు డీఎంకే
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు. అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు. కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు? తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు. వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి.. నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. -
తమిళనాట మోదీ సంచలన ప్రకటన.. డిఫెన్స్‌లో డీఎంకే!
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్‌కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea — ANI (@ANI) April 10, 2024 కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. -
అన్నామలై Vs కమల్: తమిళనాట రసవత్తర రాజకీయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్‌పూర్‌కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur. Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC — Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024 కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్‌పూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
మోదీ మాత్రమే ఉంటారు.. బీజేపీ కాదు: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓ జాతీయా మీడియా ఇంటర్య్వూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఎన్నికల ఫలితాలు వెలువడగానే పీఎం అభ్యర్థిని కూటమి ప్రకటింస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీలంకను చాలా సార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 సీట్లతో పోటి చేయగా 23 స్థానాల్లో గెలుపొందింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సిట్లలో విజయం సాధించింది. సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక.. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి. -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు. ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ. ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది. ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది. నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి. చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే. శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
TN: ప్రధానికి ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నామని ప్రధాని మోదీ ఇటీవలి తమిళనాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీని, బీజేపీని ఇంటికి పంపించేదాకా తమ పార్టీ నిద్రపోదన్నారు. ‘డీఎంకే నేతలకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. అవును మేం నిన్ను, బీజేపీని ఇంటికి పంపించేదాకా నిద్రపోము. 2014లో గ్యాస్ సిలిండర్ రూ. 450, ఇప్పుడు రూ.1200. ఇటీవలే పీఎం దానిని రూ.100 తగ్గించి ఒక డ్రామా ఆడారు.ఎన్నికల తర్వాత గ్యాస్ ధరను తిరిగి రూ.500 పెంచుతాడు’అని ఉదయనిధి ఫైర్ అయ్యారు. కాగా, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తొలి దశలోనే ఏప్రిల్ 19న జరగనుంది. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇదీ చదవండి.. రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు -
డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత
తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Tamil Nadu: Dr J Jayavardhan, AIADMK candidate from South Chennai says, "This is a consultation meeting with regards to how to work for the coming Lok Sabha election in South Chennai constituency...It is very well seen that the party cadres are with much enthusiasm… pic.twitter.com/Ff6u5pa6CA — ANI (@ANI) March 26, 2024 -
తమిళిసై వర్సెస్ తమిళచ్చి.. ఆసక్తికర పరిణామం
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్ టికెట్‌ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంతా కాసేపు షాక్‌కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. S Chennai: Pic of Tamilisai and Tamizhachi extending a courtesy hug after filing nominations N Chennai: Sekar Babu and Jayakumar fighting over which party arrived at the location first to file nomination pic.twitter.com/0AHpuWhYkN — Dharani Balasubramaniam (@dharannniii) March 25, 2024 కాగా సౌత్ చెన్నైలో బీజేపీ నుంచి తమిళిసై, డీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి, అన్నాడీఎంకే నుంచి డాక్టర్ జయవర్దన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో స్థానికంగా పోరు ఆసక్తికరంగా మారింది. #WATCH | Chennai, Tamil Nadu: After filing her nomination for the Lok Sabha elections, former Telangana Governor and Puducherry Lieutenant Governor and BJP candidate Tamilisai Soundararajan says, " The people want PM Modi to be Prime Minister again. South Chennai is a… pic.twitter.com/SLmZ0sy05R — ANI (@ANI) March 25, 2024 -
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్‌పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్ రాజు మిమ్మల్ని కమల్ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత స్థాయి. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా ప్రకటనలో చైనా జెండా ముద్రించటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్. -
ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి నీచపు వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ నేతలు
చెన్నై: డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీని దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండి పడుతున్నారు. తక్షణమే రాధాకృష్ణన్ మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనితా రాధాకృష్ణన్.. మోదీపై చేసిన వ్యాక్యాలకు సంబంధించిన వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అది క్షమించరాని నేరమని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ కూడా ఈ వీడియోను తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ.. మంత్రిని బర్తరఫ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. ఇంగ్లిష్ భాషలో అత్యంత నీచమైన (చెడ్డ) పదమని ఆ మంత్రి వాడారని.. డీఎంకేకు సిగ్గు ఉంటే.. ప్రధానిని దుర్భాషలాడినందుకు మంత్రిని బర్తరఫ్ చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా.. ప్రధానిపై రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి భాషకు స్థానం లేదని అన్నారు. మనిషికి విధ్వంసం సంభవించినప్పుడు, ముందుగా చనిపోయేది మనస్సాక్షి. ఇండియా కూటమిలో ఉన్నవారు మనస్సాక్షిని కోల్పోతున్నారని ఠాకూర్ అన్నారు. #WATCH | Chennai: On Tamil Nadu Minister Anitha Radhakrishnan's remark against PM Modi, State BJP Vice President Narayanan Thirupathy says, "This is really atrocious...If DMK has some shame, they should dismiss this minister for abusing PM in a filthy manner. He should be sacked… pic.twitter.com/o0ST1zjfjv — ANI (@ANI) March 24, 2024 -
వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆదివారం స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు విమర్శంచినట్లు.. డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీనే. నేను కూడా అంగీకరిస్తాను. అయితే తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబం’ అని మంత్రి ఉదయనిధి అన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై ర్యాలీలో పాల్గొని ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ వారసత్వం కుటంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. కానీ, నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోదీ తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మొదట ప్రాధాన్యం కుటుంబం.. తర్వాతే దేశం అని అన్నారు. అదే విధంగా ఇండియా కూటమి మొత్తం ఇదే విధానాన్ని పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు. ఇక.. తమిళనాడు మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 38 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే సొంతంగా 23 స్థానాల్లో గెలుపొంది.. 33.2 శాతం ఓట్ షేర్‌ను సంపాధించుకుంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 19న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
గెలుపు మాదే.. పీఎం కేర్ ఫండ్స్‌పై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై : పీఎం కేర్ ఫండ్స్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కేర్ ఫండ్స్ రహస్యాల్ని బహిర్గతం చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే, ‘వారు (బీజేపీ, కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) మరొక విధంగా నిధుల్ని సేకరించారు. దీనికి పీఎం కేర్స్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఫండ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవక తవకలు జరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడు కోసం అమలు చేసిన ఒక ప్రత్యేక పథకాన్ని ప్రధాని మోదీ చెప్పగలరా? అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అడిగారు. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
కూటమి అభ్యర్థి విజయానికి సమష్టిగా పని చేయండి
తిరువళ్లూరు: స్థానిక పార్లమెంట్ స్థానంలో కూటమి అభ్యర్థి విజయానికి అన్ని పార్టీల ప్రతినిధులు సమష్టిగా పని చేయాలని తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయనున్నారు. కూటమి అభ్యర్థి గెలుపు అంశంపై చర్చించడానికి వేర్వేరు పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్ హాజరై మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం మూడేళ్లలో వేర్వేరు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పారీ నేతలు తిరుత్తణి భూపతి, కూటమి నేతలు ఆదిశేషన్, ద్రావిడభక్తన్, బాబు, గోపాల్, తమిళరసు తదితరులు పాల్గొన్నారు. -
డీఎంకే మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
సాక్షి, చైన్నె: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా డీఎంకే మెగా కూటమి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 19 స్థానాలను అధికార డీఎంకే కేటాయించింది. మిగిలిన 21 స్థానాలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా బుధవారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను స్టాలిన్ మీడియాకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలే కాదు. అధికారంలోకి వచ్చినానంతరం ఇవ్వని వాగ్దానాలనూ కూడా అమలు చేసిన ఘనత ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టోను రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో రూపొందించామని వివరించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ● రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా చట్ట సవరణకు తొలి ప్రాధాన్యత. ● అనవసరంగా ఉన్న గవర్నర్ పదవి వ్యవహారంలో మార్పులు, సీఎం సలహాలను తప్పని సరిగా స్వీకరించాలనే నిబంధన రూపకల్పనకు కృషి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే సెక్షన్ 361 రద్దు. ● చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పనకు ప్రణాళిక. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహణ. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో తమిళం తప్పనిసరి. అన్ని భాషల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. జాతీయ గ్రంథంగా తిరుక్కురల్ ప్రకటన. ● శ్రీలంక నుంచి తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డ తమిళులకు భారత పౌరసత్వం కేటాయింపు. ● రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్, చైన్నెలో మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఏర్పాటు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో అల్పాహార పథకం అమలు చేసేందుకు చర్యలు. ● దేశవ్యాప్తంగా గృహిణులకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ పథకం అమలు. ● నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు. అన్ని రాష్ట్రాలలో సీఎంల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం పంపిణీ. ● బీజేపీ తీసుకొచ్చిన కొన్ని అసంబద్ధ కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు, పథకాలు రద్దు, మరికొన్నింటిపై పునర్ సమీక్ష. జమిలీ ఎన్నికల రద్దు. జాతీయ రహదారులలో టోల్గేట్ల ఎత్తివేత. బ్యాంక్‌లలో కనీస నగదు నిల్వ నిబంధన ఎత్తివేత. సీఏఏ చట్టం రద్దు. దేశవ్యాప్తంగా కులగణన. రైతులకు మద్దతు ధర కల్పన, దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యారుణాల రద్దు. కొత్తగా రూ. 4 లక్షలు రుణాల పంపిణీ. తమిళనాడులో జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు. విమాన చార్జీల క్రమబద్ధీకరణ. ● ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 500, లీటరు పెట్రోల్ రూ. 75, లీటరు డీజిల్ ధర రూ. 65గా నిర్ణయం. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు. రోజు వారీ కూలి రూ. 400కు పెంపు. 21 మంది అభ్యర్థుల ప్రకటన మేనిఫెస్టో విడుదల తర్వాత తమ పార్టీ పోటీ చేసే స్థానాలలో 21 మంది అభ్యర్థుల జాబితాను స్టాలిన్ ప్రకటించారు. ఇందులో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మరో 11 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎంపీలలో ధర్మపురి సెంథిల్‌కుమార్, కళ్లకురిచ్చి సీనియర్ నేత పొన్ముడి వారసుడు గౌతం శిఖామణి, సేలం పార్తీబన్, తంజావూరు నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యం, తెన్కాశి ధనుష్‌కుమార్, పొల్లాచ్చి షణ్ముగసుందరం తదితరులకు ఈసారి సీటు కేటాయించలేదు. పొన్ముడి వారసుడిపై కోర్టులలో కేసులు ఉండటం ఓ కారణమైనా, నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యంకు సీటు ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరులో పోటీ చేసే మురసోలి అనే అభ్యర్థి పేరును పలుమార్లు సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈరోడ్‌లో కొత్తగా పోటీ చేస్తున్న కె. ప్రకాష్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్నిహితుడు కాగా, పెరంబలూరులో పోటీ చేయనున్న అరుణ్ నెహ్రూ, సీనియర్ నేత, మంత్రి కేఎన్ నెహ్రూ వారసుడు కావడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి సెల్వ గణపతికి ఈసారి సేలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా 21 మంది అభ్యర్థుల్లో 19 మంది పట్టభద్రులు, ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. -
టోల్గేట్ల తొలగింపు.. నీట్ రద్దు, డీఎంకే మేనిఫెస్టో విడుదల
సాక్షి, చెన్నై : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్ తన సోదరి కనిమోళిని ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపై కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. కాగా మేనిఫెస్టోతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా స్టాలిన్ ప్రకటించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుంది. మా నాయకులకు అదే నేర్పాం. ద్రవిడ మోడల్లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా చేస్తాయని అన్నారు. డీఎంకే మెనిఫెస్టోలో ఏయే అంశాలు ఉన్నాయంటే రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా జాతీయ విద్యా విధానం (NEP) ఉపసంహరణ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఉదయం అల్పాహారం సదుపాయం. నీట్ బ్యాన్. రాష్ట్రంలో టోల్ గేట్ల తొలగింపు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం ఎల్పీజీ గ్యాస్ -500, లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్- రూ.65 అందిస్తూ నిర్ణయం తిరుకురల్‌ను ‘నేషనల్ బుక్’ గా తీర్చిదిద్దేలా నిర్ణయం దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసింది డీఎంకే. లోక్‌సభ అభ్యర్ధులు వీరే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధుల జాబితాను ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. వారిలో డీఎంకే పార్టీలో కీలకనేతలైన కె కనిమొళి, ఎ రాజా తదితరులు ఉన్నారు. ఉత్తర చెన్నై - కళానిధి వీరాసామి, దక్షిణ చెన్నై - తమిళచ్చి తంగపాండియన్, సెంట్రల్ చెన్నై - దయానిధి మారన్, శ్రీపెరుంబత్తూరు - టీఆర్ బాలు, అరకోణం - జగత్రాచహన్, వెల్లూరు - కంధీర్లను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. వీరితో పాటు తిరువనమలై - అన్నాదురై, ఆరణి - ధరణి, సేలం - సెల్వగపతి, ఈరోడ్ - ప్రకాష్, నీలగిరి - ఏ రాజా, కోవై - గణపతి రాజ్‌కుమార్, పెరంబలూరు - అరుణ్ నేరు, తంజావూరు - మురసోలి, తేని - తంగ తమిళ్ సెల్వం, తుత్తుకుడి - కనిమొళి, తెంకాసి - రాణి, కళ్లకురిచి - మలైయరసన్. -
తమిళనాడులో బీజేపీ వ్యూహం
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ దళానికి దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తమిళనాట అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయాలు ఎన్డీయే కూటమిలోకి పీఎంకే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. 400 ఫ్లస్ సీట్లను ఎన్డీయే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణ రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్యం దిశగా..సీట్ల కేటాయింపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీయే కూటమిలో చేరిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అన్నా డీఎంకే వద్దకు పీఎంకే దూత పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు, సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరిపాలని అనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు. బీజేపీతో పొత్తు అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఒప్పందంపై సంతకమే పొత్తుపై పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి సంయుక్తంగా తీసుకున్నారని’ చెప్పారు. పీఎంకేలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ నేతలు వెల్లడించారు. అధికారిక ఎన్నికల ఒప్పందంపై సంతకం చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తైలాపురం వెళ్లనున్నారు. అన్నామలై ప్రయత్నాలు సఫలం బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం, అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి. బీజేపీలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకుంది. ఒకే దెబ్బకు తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో వన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది. దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య Mukkulathorలను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌ల మద్దతు కూడగట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలే కాదు తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోదీ వరుస పర్యటనలు చేయడంతో పాటు, భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
డీఎంకే, కాంగ్రెస్ వైఖరి ఇప్పటికీ అలాగే.. మండిపడ్డ మోదీ
తమిళనాడును డీఎంకే - కాంగ్రెస్ ఇండియా కూటమి ఎప్పటికీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేవని కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలతో ఎలా అనుచితంగా ప్రవర్తించాలో కాంగ్రెస్, డీఎంకేలకు మాత్రమే తెలుసు. డీఎంకే మహిళల పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జయలలితకు డీఎంకే నేతలు ఏం చేశారో అందరికీ గుర్తుంది. మహిళల పట్ల వారి వైఖరి ఇప్పటికీ అలాగే ఉంది. తమిళనాడులో మహిళలపై నేరాలు పెరిగాయి. మేము పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ - డీఎంకే మద్దతు ఇవ్వలేదు. తమిళనాడు ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. నేను ఇటీవల తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించాను. మా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోంది. ఆధునిక ఫిషింగ్ బోట్లకు ఆర్థిక సహాయం అందించడం నుంచి వాటిని కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పరిధిలోకి తీసుకురావడం వరకు మేము వారి సంరక్షణను తీసుకున్నామని మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ 2జీ కుంభకోణంతో ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఒకవైపు బీజేపీ సంక్షేమ పథకాలు.. మరోవైపు మీ వద్ద INDI అలయన్స్ స్కామ్ జాబితా ఉంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ.. తమిళనాడులోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి దురహంకారాన్ని బద్దలు కొట్టనుందని మోదీ అన్నారు. -
ద్రవిడవాదంలో వేర్పాటు నినాదం
వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో అసంతృప్తిని రేకెత్తించడం, అది ఆగ్రహమై, ఉద్యమంగానో, ఆఖరికి ఉగ్రవాదంగానో పరిణమించడం పరిపాటే. ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో ప్రత్యేక దేశం నినాదాలు వినిపించేవి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కూడా ఇదే వినిపించేవారు. రెడ్ కారిడార్ నినాదంలో కూడా ఇందుకు సంబంధించిన ఛాయలు ఉన్నాయి. కానీ తమిళనాడులో ద్రవిడవాదం మోతాదు ఎక్కువగా ఉన్న డీఎంకే వినిపించే వేర్పాటువాదం, తామొక జాతి అని చెప్పుకోవడం వెనుక కుత్సిత రాజకీయం మాత్రమే ఉంది. ఆ పార్టీలో కొందరు ప్రత్యేక దేశం నినాదాన్ని అందుకోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన కేవలం బీజేపీది అనుకోవడం అజ్ఞానం. ఒక పార్టీ మీద ద్వేషం దేశ ఐక్యతకు విఘాతం కారాదు. భారత ఈశాన్య ప్రాంతాన్నో, కశ్మీర్ లోయ పరిస్థితులతోనో పోలిస్తే తమిళనాడు ప్రాంతం వేర్పాటువాద నినాదాన్ని అందుకోవలసిన అగత్యం ఏమాత్రం లేదు. కొందరు నాయకుల అజెండా ప్రజలందరి ఆశయం కూడా కాదు. తమిళ సమాజంలో అందుకు సంబంధించిన రుజువులు కూడా లేవు. చెన్నై ఇవాళ నాలుగు మెట్రో నగరాలలో ఒకటి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం (ఏ పార్టీది అయినా) అండ లేకుండా అది సాధ్యమయ్యే దేనా? ఢిల్లీ వివక్షే చూపి ఉంటే జరిగేదేనా? ద్రవిడవాదం, అది చెప్పే ప్రాంతీయవాదం, వేర్పాటువాదం, నాస్తికత్వం తమిళనాట కొద్దిమందిలో ఉంటే ఉండవచ్చు. మెజారిటీ ప్రజలు కచ్చితంగా వాటికి దూరంగానే ఉన్నారు. అక్కడి జీవన సరళిని చూసినవారు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. కాబట్టి తమిళనాడులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వాదనలు కుత్సిత రాజకీయానికి సంబంధించినవే. డీఎంకే ఎంపీ ఎ.రాజా తాజాగా భారత్ ఒక దేశం కాదని తీర్పు ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల కూటమి అంటాడు. ఒక దేశమైతే ఒకే భాష ఉంటుందని వింత భాష్యం చెప్పాడు. తమిళనాడుకు దేశం అనదగ్గ లక్షణాలు ఉన్నాయంటాడు. ఈ దేశంలో అనుసంధాన భాషగా సంస్కృతం చిరకాలం ఉంది. రాజా వాదన మీదే ఒక్క క్షణం నిలబడి ఇంకొక ప్రశ్న వేయాలి. తమిళనాడులోనే ఉన్న కొంగునాడు (కొంత భాగం కేరళ, కర్ణాటకలలో కూడా విస్తరించి ఉంది) ప్రజలు ఇది కూడా ‘నాడు’, కాబట్టి తమదీ ఒక జాతేననీ, తమకూ దేశం కావాలనీ అంటే డీఎంకే ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది? ‘నాడు’ అనేది భౌగోళిక ఉనికికి పేరు. అది మరచిపోతే ఎలా? తమిళులకో ప్రత్యేక దేశం కోరికతో ఈవీ రామస్వామి నాయకర్ క్రిప్స్ మిషన్‌కు వినతిపత్రం సమర్పించాడు. దానికి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఏమిటో ఇప్పటికీ తెలియదు. ద్రవిడస్థాన్ నినాదంతో, కోరికతో ఏమాత్రం పొంతన లేనిది ముస్లింలకో ప్రత్యేక రాజ్యం. అది జిన్నా, కొందరు ముస్లింల కోరిక. అలాంటి జిన్నాను తనకు వత్తాసుగా తెచ్చుకోవాలని చూసి ఈవీ భంగపడిన సంగతి చరిత్ర ప్రసిద్ధమే. ‘నేను ముస్లింలందరికీ నాయకుడినే; కానీ తమిళులంతా నీ (ఈవీ) వెనుక లేరు’ అన్నది జిన్నా వివరణ. నేటికీ అదే వాస్తవం. తమిళులంతా ద్రవిడవాదం మత్తులో లేరు. ఏనాడూ లేరు. 1942లోనే కాలం చేసిన ఆ వాదాన్ని ఆవాహన చేస్తామని బెదిరిస్తూ డీఎంకే పబ్బం గడుపుకొంటున్నది. ఇదంతా గమనించాక ఈవీ రామస్వామి నాయకర్ను పిచ్చాసుపత్రిలో ఉంచవలసిన వ్యక్తిగా ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా భావించారు. కానీ ఇప్పటికీ అలాంటివాడి వికృత వాదంతో పార్టీలు రాజకీయాలు సాగించడమే విషాదం. ఎ.రాజా తాజా ప్రకటన కావచ్చు, ఆ మధ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమా రుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు కావచ్చు, ఆ ఆవాహన బెదిరింపులో భాగమే. వీటికి తాజా నేపథ్యం ఉంది. దేశ రాజకీయాలలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదగడం. ద్రవిడవాద అడ్డా తమిళనాడుకు రాదనుకున్న బీజేపీ... అన్నామలై (తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు) రూపంలో విశ్వరూపం దాల్చడం! భారత్ ఒక దేశం కాదు, ఉపఖండం అంటాడు రాజా. ఈ ఒక్క అంశమే కేంద్రబిందువుగా ఆయన వాదం సాగడం లేదు. దీనికి రాముడినీ, రామాయణాన్నీ జోడిస్తున్నాడు. ఆ రెండు అంశాల మీద ఆయనకి విశ్వాసం లేదట. లేకపోవచ్చు. కానీ రాజా ఈ రాముడినీ, రామాయణాన్నీ డీఎంకే వేర్పాటువాదానికి తోడు తెచ్చుకునే పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు భారతదేశ ఉత్తర భాగం వాడనీ, భారతభూమి దక్షిణ భాగంతో సంబంధమే లేదనీ డీఎంకే మొదటి నుంచి భాష్యం చెబుతోంది. ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వద్ద ఇటీవలే జరిగిన సభలో రాజా ఇవన్నీ మాట్లాడాడు. నిజానికి ఈ వాదం కూడా తప్పే. దీనికి అన్నామలై ఇటీవలనే చక్కని వివరణ ఇచ్చాడు. తమిళనాడులోనే ఆరణి క్షేత్రంలో శివాలయం ఉంది. దాని పేరు పుత్తరకామెట్టీశ్వరాలయం. దశరథుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తరువాతే ఆయనకు సంతానం కలిగిందని ప్రతీతి. అలాగే రామేశ్వరానికీ, వారణాసికీ నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్న బంధాన్ని మరచిపోరాదు. ఈ జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి ప్రతిమకు దక్షిణాది కన్నడిగుడే జన్మనివ్వడం యాదృచ్ఛికం కావచ్చు. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన 1950లలో పుట్టిన భారతీయ జనసంఘ్దో లేదా 1980లలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీదో అనుకోవడం శుద్ధ అజ్ఞానం. మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేసే ఉద్దేశంతోనే భారత స్వాతంత్య్రోద్యమం సాగింది. దీనికి వందలాది ఉదాహరణలు చూపించవచ్చు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జీవితమే దీనికి రుజువు. గాంధీజీ పిలుపునకు, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమానికి తమిళనాడు కూడా కదిలింది. జాతీయ భావనతో, సాంస్కృతికంగా ఏకత్వం ఉన్న దేశంలో సామాజిక రాజకీయ ఏకత్వం తేవడానికి భారత జాతీయ కాంగ్రెస్, కొన్ని ఇతర అతివాద జాతీయ భావాలను నమ్మిన సంస్థలు పనిచేశాయి. జాతీయ కాంగ్రెస్ తన సభలు తమిళనాడులోనూ (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) పలుసార్లు నిర్వహించింది. అడయార్ కేంద్రంగా పనిచేసిన అనీబిసెంట్ భారతీయులందరి స్వేచ్ఛ కోసం పనిచేశారు. కానీ మరొక పక్క తమిళనాడులో బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ల మోచేతి నీళ్లు తాగింది. భారత్ ఐక్యతకూ, భారతీయులు చైతన్యవంతం కావడానికీ ఇంగ్లండ్ బద్ధవ్యతిరేకి. ఎవరో ఒకరిని వివక్షతో అణచివేయడానికి కుటిలనీతిని అవలంబించడమే బ్రిటిష్ లక్షణం. దాని అవశేషమే ద్రవిడవాదం. దాని పేలికే డీఎంకే. భారతదేశ చరిత్రను బట్టి, సమీప గతాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాల ఆధారంగా డీఎంకే నేతల వదరుబోతుతనం ఎంత నిర్హేతుకమో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయాలి. నాలుగు ముక్కలైన పోలెండ్ కలసిపోయింది. రెండు ముక్కలయిన జర్మనీ ఐక్యమైంది. వేరుకావడం వల్ల కలిగే కష్టనష్టాలను ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలివి. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, ఆక్రమిత కశ్మీర్లో, బలూచిస్తాన్‌లో ప్రజలు తాము భారత దేశంలో భాగం కావాలనుకుంటున్నామని చెప్పుకోవడం వాస్తవం. ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో వేరే దేశం కోరుకోవడం, అది కూడా తమ పార్టీ బలహీనపడే లేదా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేక దేశం నినాదాన్ని అందు కోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. ఓట్ల రాజకీయంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని భగ్నం చేయాలని అనుకుంటే ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం అవసరమే. ఇప్పుడు ఎ. రాజా ప్రకటననీ, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ వాగుడునూ బీజేపీ ఖండించింది. అది సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ‘రాజా వ్యాఖ్యలతో నేను నూరు శాతం విభేదిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ నిర్ద్వంద్వంగా పేర్కొనడం స్వాగతించవలసినదే. ఆ పార్టీ కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ రెండు భారతదేశాల గురించి మాట్లాడినందుకు ఇది పాప పరిహారం కావచ్చు. రేపు ఎన్నికలలో ‘ఇండి’ పేరుతో ఎన్డీఏని ఎదుర్కొ నబోతున్న కూటమి భాగస్వాములు తోటి ద్రవిడ భాగస్వామి చేస్తున్న ఇలాంటి ప్రేలాపనలను నిర్ద్వంద్వంగా ఖండించడం అవసరం. భార తీయ జనతా పార్టీని వ్యతిరేకించడం, దానిని అధికారం నుంచి దించా లనుకోవడం తప్పు పట్టవలసిన విషయం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం భారతదేశ ఐక్యతకు విఘాతం కారాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్‌పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్‌స్టిక్‌ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement