డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత | DMK Government Is Anti-People, Says AIADMK's Jayavardhan - Sakshi
Sakshi News home page

డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత

Published Tue, Mar 26 2024 10:51 AM

DMK Government is Anti People Say Jayavardhan - Sakshi

తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి.

ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్‌డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement
Advertisement