ఎటువంటి వివాదాలూ లేకుండా.. | Sakshi
Sakshi News home page

ఎటువంటి వివాదాలూ లేకుండా..

Published Fri, May 10 2024 1:30 PM

ఎటువంటి వివాదాలూ లేకుండా..

ఈ ఆలయాన్ని 2011లో పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు చేసినపుడు పురావస్తు శాఖ వారు.. ఇది వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఆలయమని.. అందువలన దీనిని తొలగించరాదని అభ్యంతరం చెప్పారు. అప్పుడు ఈ ఆలయ చరిత్రను వారికి వివరించి, పాత ఆలయం 1933–34లో మాత్రమే నిర్మించారని తెలియచేసి ఆలయ పునర్నిర్మాణం చేశాం. భవిష్యత్తులో ఆలయ చరిత్రపై ఎటువంటి వివాదాలూ లేకుండా స్పష్టమైన వివరాలతో కూడిన శాసనం వంటిది ఉండాలని భావించి, యంత్రాలయంలోని గ్రానైట్‌ రాతి గోడపై దీనిని చెక్కించాం. ఇటువంటి ప్రకటనను ఆలయ ప్రాంగణంలో కూడా ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తాం.

– కె.రామచంద్ర మోహన్‌, ఈఓ, అన్నవరం దేవస్థానం

Advertisement
 
Advertisement
 
Advertisement