-
ఫెడ్ నిర్ణయాలకు ఎదురుచూపు
ముంబై: అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే రిలయన్స్ (1.45%)తో పాటు మెటల్, ఇంధన, ఆటో షేర్లూ రాణించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్‌లో 672 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 105 పాయింట్ల లాభంతో 72,748 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 207 పాయింట్ల రేంజ్లో 22,124 వద్ద గరిష్టాన్ని, 21,917 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 32 పాయింట్లు పెరిగి 22,056 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ప్రారంభంలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్ సెషన్ తర్వాత ఇటీవల దిగివచి్చన నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ,, ప్రైవేటు బ్యాంకులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ స్వల్పంగా 0.4% లాభపడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7% నష్టపోయింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
సూచీలకు మళ్లీ లాభాలు
ముంబై: ఒక రోజు నష్టాల ముగింపు తర్వాత దేశీయ స్టాక్ సూచీలకు గురువారం మళ్లీ లాభాలొచ్చాయి. వడ్డీ రేట్ల పెంపు ఈ దఫా చివరిది కావచ్చంటూ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన కమిటి నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల విడుదలైన దేశీయ కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు మెప్పించాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం కలిసొచ్చాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1% వరకు బలపడి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 65 పాయింట్లు పెరిగి 61,258 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 605 పాయింట్లు ర్యాలీ చేసి 61,797 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆఖరికి 556 పాయింట్ల లాభంతో 61,749 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు దూసుకెళ్లి 18,267 గరిష్టాన్ని తాకింది. చివరికి 166 పాయింట్లు బలపడి 18,256 వద్ద నిలిచింది. విస్తృత స్థాయి మార్కెట్లో ఒక్క ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.83%, 0.82% చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1415 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.442 కోట్ల షేర్లను కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం విలువ రూ.2.21 లక్షల కోట్లు పెరిగి 275.13 లక్షల కోట్లకు చేరింది. ఆసియాలో షాంఘై, హాంగ్‌కాంగ్ సూచీలు లాభపడగా., కొరియా ఇండెక్స్ నష్టపోయింది. ఈసీబీ పావుశాతం వడ్డీరేట్ల పెంపుతో యూరప్ మార్కెట్లు 0.50 – 1% క్షీణించాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీస్ ‘బై’ రేటింగ్‌తో ఫుడ్ డెలీవరీ దిగ్గజం జొమాటో షేరు 3% పైగా లాభపడి రూ.65.63 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికంలో నికరలాభం 13% బజాజ్ కన్జూమర్ కేర్ షేరు నాలుగుశాతం పెరిగి రూ.172 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో పదిశాతం దూసుకెళ్లి రూ.182 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► అంచనాలకు మించి మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించడంతో ఏబీబీ షేరు ఐదున్నర శాతం బలపడి రూ.3,646 వద్ద స్థిరపడింది. -
మార్కెట్లు అక్కడక్కడే...
ఆసియా మార్కెట్ల నష్టాల ప్రభావంతో దేశీ స్టాక్ సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. చివరికి సోమవారం ముగింపును పోలి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 26,315-26,482 పాయింట్ల మధ్య ఒడిదుడుకులకు లోనైంది. చివరికి 6 పాయింట్ల స్వల్ప లాభంతో 26,443 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్ట ముగింపుకాగా, నిఫ్టీ మాత్రం ఒక పాయింట్ తగ్గి 7,905 వద్ద నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాలలో ప్రభుత్వాలు చేపట్టిన బొగ్గు క్షేత్రాల కేటాయింపులు అక్రమమంటూ సుప్రీం కోర్టు పేర్కొనడం, గురువారం ముగియనున్న ఆగస్ట్ ఎఫ్‌అండ్‌వో సిరీస్ వంటి అంశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారంటూ నిపుణులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ ఓకే, పవర్ డీలా బీఎస్ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్ ఇండెక్స్ 1%పైగా లాభపడగా, పవర్ అదే స్థాయిలో డీలాపడింది. సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా 3.6-1.4% మధ్య పుంజుకోగా, టాటా పవర్, ఓఎన్జీసీ 2.5% చొప్పున నష్టపోయాయి.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్‌లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement