టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు | Sajjala Ramakrishna Reddy Key Comments Over Land Titling Act In AP | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ, పవన్‌ భూములు కొన్న పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా: సజ్జల

Published Fri, May 10 2024 1:03 PM | Last Updated on Fri, May 10 2024 3:14 PM

Sajjala Ramakrishna Reddy Key Comments Over Land Titling Act In AP

సాక్షి, తాడేపల్లి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ‍వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్‌ చేసి దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్‌ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జూలై 29వ తేదీన టీడీపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మద్దతిచ్చింది. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చింది?.

యాక్ట్‌పై ప్రజలను భయపెట్టేలా.. చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?. ఇదంతా వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఓటు వేయవద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది. శాసనసభ, శాసన మండలిలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అ‍డ్డంగా బుక్కైంది. గత 15 రోజులుగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ విష ప్రచారం చేస్తోంది.

బాబు.. పేపర్లు చించేయగలరా?
ఈ-‍స్టాంపింగ్‌ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది. తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్‌ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్‌ కాపీలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్‌ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. స్టాంపింగ్‌ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది. ఈ-‍స్టాంపింగ్‌ పత్రాలు జిరాక్స్‌ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్‌ షాతో ఎందుకు చెప్పించలేదు?. 

చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్‌ భూములు సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారు. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ కూడా భూములు కొన్నారు. మరి పత్రాలు జిరాక్స్‌ కాపీలేనా?. ప్రజలు భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తి అయ్యాక ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమల్లోకి వస్తుంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది’ అని కామెంట్స్‌ చేశారు. 

  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు
  • ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయబ్రాంతులు కల్పిస్తున్నారు
  • చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది
  • జనాల్లో భయబ్రాంతులు సృష్టించి, దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్ర
  • ల్యాండ్ టైటిలింగ్ చట్టం పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతిచ్చింది?
  • 2019 జులై 29న టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మద్దతిచ్చింది
  • వీళ్లు అసలు మనుషులా? పిశాచాలా?
  • ల్యాండ్ టైటిలింగ్ తర్వాత భూమికి ప్రభుత్వం పూచీ ఇస్తుంది
  • విపక్షంగా ఉన్న టీడీపీ ఈ బిల్లుకు పూర్తిగా మద్దతిచ్చింది
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా?
  • ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర 
  • ఎన్నికల ముందు అసెంబ్లీలో మద్దతిచ్చిన టీడీపీ, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది
  • 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం చేస్తోంది
  • అప్పుడు ఆమోదించి, ఇప్పుడు వ్యతిరేకించి టీడీపీ అడ్డంగా బుక్కైంది 
  • పవన్ ఫిబ్రవరిలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తి ఏం అయ్యింది?
  • మరి ఎవరైన అక్కడికి వెళ్లి జెండా పాతితే వదిలేస్తారా?
  • ఏపీలో ఈ-స్టాంప్ కలెక్షన్ 2016-2017 నుంచి ప్రారంభమైంది
  • అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీనే 
  • ఈ-స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే ప్రారంభమైంది
  • తన హయాంలో ప్రారంభమైన ఈ-స్టాంపింగ్ విధానాన్ని చంద్రబాబు జిరాక్స్ కాపీలు అంటున్నారు
  • చంద్రబాబు హయాంలో తెల్గీ కుంభకోణం తర్వాత స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించింది
  • ఈ-స్టాంపింగ్ పత్రాలు జిరాక్స్ కాపీలు అయితే వాటిని చంద్రబాబు చించేయాలి
  • బాలకృష్ణ, పవన్ కల్యాణ్ భూములు కొన్నారు.. మరి ఆ పత్రాలు జిరాక్స్ కాపీలేనా?
  • భూముల సమగ్ర సర్వే మొత్తం పూర్తకయ్యానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది
  • చంద్రబాబు ఇరకాటంలో పెట్టిన చుక్కల భూములు, ఇనామ్ భూముల సమస్యను జగన్ పరిష్కరించారు
  • ప్రజల్ని భయపెట్టి నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు
  • గత ఎన్నికల్లో వారం ముందు పసుపు-కుంకుమ అని చంద్రబాబు చెక్కులు ఇచ్చినా ఈసీ పట్టించుకోలేదు 
టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement