టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. రమణ దీక్షితులుపై వేటు | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. రమణ దీక్షితులుపై వేటు

Published Mon, Feb 26 2024 12:08 PM

Ttd Board Key Decisions  - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన  సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్‌ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు నీచాతినీచమైన ఆరోపణలు చేశారని, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయర్‌లపై నిరాధార నిందలు వేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. కాగా, దేవస్థానం ఉద్యోగులకు బోర్డు శుభవార్త చెప్పింది. 4736 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 4200 కార్పొరేషన్ ఉద్యోగులతో కలిపి 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


టీటీడీ పాలకమండలి ‌నిర్ణయాలు..

  • నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం
  • తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం 
  • తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు, ద్వారపాలకులు అయినా జయవిజయలకు బంగారు తాపడం 
  • రూ.4 కోట్లతో తాళిబొట్లు  తయారికి అంగీకారం
  • పీఠాధిపతులు సదస్సులో సూచించిన సూచనలు ఆమోదం
  • వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు 
  • తిరుచానూరు పద్మావతి అమ్మవాతి ఆలయాని విద్యుత్ అలంకరణలకు అమోదం
  • భక్తుల సౌఖర్యార్థం శాశ్వత గోశాలకు బోర్డు మెంబర్ విరాళం
  • ఎక్కవ సంఖ్యలో లడ్డు తయారికి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ
  • పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు 3.18 కోట్లు ఆమోదం
  • ఎంఏమ్ఎస్ సేవలు మూడు సంవత్సరాలు పోడొగింపు
  • 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు
  • అలిపిరి , గాలిగోపురం  నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ
  • ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయం
  • బాలబాలికల్లో భక్తి పెంపొందించడానికి 99 లక్షలు పుస్తాల ముద్రణకు
  • స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం
  • టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఒఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్‌లో రూ.10కే భోజనం
  • అన్నప్రసాద కేంద్రం సూపర్ వైజర్ పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ 

ఇదీ చదవండి.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertisement
Advertisement