అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

Published Wed, May 8 2024 8:15 AM

అడిషన

పాలకుర్తి టౌన్‌: శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మిప్రసన్న, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలోని ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ ఆవరణలో మంగళవారం విద్యుత్‌ భద్రత వారోత్సవాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఇన్‌చార్జ్‌ టి.సదర్‌లాల్‌, డీఈ హుస్సేన్‌నాయక్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ భద్రత గురించి అందరికి తెలిసే విధంగా పోస్టర్లను ముద్రించడం జరిగిందన్నారు. విద్యుత్‌ ప్రమాద రహిత సంస్థగా రూపొందించే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.

సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలి

బచ్చన్నపేట: మండల కేంద్రంలోని సీహెచ్‌సీ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగేలా వైద్యులు చూడాలని జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి రవీందర్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించారు . అనంతరం మాట్లాడుతూ ఓబుల్‌కేశ్వాపూర్‌, నర్మెట మండలంలోని గ్రామాలకు సంబంధించిన గర్భిణనులు సాధారణ ప్రసవాలకు బచ్చన్నపేట సీహెచ్‌సీ ఆస్పత్రికి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైధ్యాధికారి సిద్దార్థరెడ్డి, వైద్యులు సృజన, రూపాదేవి, సీహెచ్‌ఓ జంగమ్మ, ఫార్మాసిస్ట్‌ బొడ్డు శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ అరుణ, స్టాఫ్‌ నర్సులు, పలువురు పాల్గొన్నారు.

ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌

కాళోజీ సెంటర్‌ : వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 బ్యాలెట్‌ యూనిట్లు, 50 కంట్రోల్‌ యూనిట్లు, 10 వీవీ ప్యాట్లు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌కు 12 బ్యాలెట్‌ యూనిట్లు, 50 కంట్రోల్‌ యూనిట్లు, 8 వీవీ ప్యాట్లను కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు బండారి స్వాగత్‌ రణవీర్‌చంద్‌ సమక్షంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఈవీఎంల రెండో విడత అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, రాధికాగుప్తా, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వనారాయణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ శ్రీనివాస్‌, అమరేందర్‌రెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమ పాలనను ఆశీర్వదించండి

డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

జనగామ: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ పాలనను పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశీ ర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో టీపీసీసీ కార్యదర్శి జయ ప్రకాష్‌, టీపీసీసీ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌, దూవయ్యగౌడ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి జయప్రకాష్‌, సభ్యుడు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బడికె ఇందిర కిష్టస్వామి, ఇ జ్జగిరి రాములు, శివరాజ్‌ పాల్గొన్నారు.

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు
1/3

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు
2/3

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు
3/3

అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

Advertisement
Advertisement