అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా | Sakshi
Sakshi News home page

అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా

Published Thu, Dec 14 2023 2:01 PM

Ambani Wouldnt Care About Bull Or Bear Market - Sakshi

ఈక్విటీ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేసిన చాలామంది మార్కెట్‌ అవర్‌లో తీవ్ర ఆందోళన చెందుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఎలాంటి టెన్షన్‌ పడకుండా, నిశ్చింతగా ఉంటారు.

అయితే కేవలం మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారికే ఇలాంటి ఆందోళన పరిస్థితులుంటే.. కంపెనీలు స్థాపించి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్‌ అంబానీ పరిస్థితేంటో ఊహించండి.. కానీ ఆయన చాలా విషయాలు పట్టించుకోరని కేడియా సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కేడియా అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో తెలుసుకుందాం.

విజయ్ కేడియా ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చాలా మంది ట్రేడింగ్‌కు సంబంధించి ఆందోళన చెందుతుంటారు. అయితే మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి కొందరు ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాన్ని తీసుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే బుల్ మార్కెట్ లేదా బేర్ మార్కెట్‌ను పట్టించుకోకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అలాంటి వారు ప్రధానంగా బిజినెస్‌ మోడల్‌పై దృష్టిసారిస్తారు. మంచి బిజినెస్‌ మోడల్‌లో ఇన్వెస్ట్‌ చే​యడానికి ఎలాంటి ట్రెండ్‌ను పట్టించుకోరు. కంపెనీ ప్రమోటర్లు తమ వ్యాపారాలను విస్తరింపజేసి, అది బుల్ మార్కెటా? లేదా బేర్ మార్కెటా? అని నిర్ధారించుకోరు. మార్కెట్‌ ట్రెండ్‌ను అనుసరించి ప్రమోటర్లు నిర్ణయం తీసుకోరు’ అని కెడియా చెప్పారు. 

‘ప్రధానంగా కంపెనీ ప్రమోటర్లు, వ్యవస్థాపకులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆర్థిక పోకడలు ఎలా ఉన్నాయి? అదే సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల ట్రెండ్‌ ఎలా ఉందో చూస్తారు. మార్కెట్‌ ట్రెంట్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ముఖేష్ అంబానీ‌ని అడిగితే తనకు తెలియదు. ఆయన నిర్ణయాలపై బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఆధారపడుతుంది. కానీ తాను మార్కెట్‌ను అనుసరించరు’ అని కేడియా వివరించారు.

ఇదీ చదవండి: ఇకపై కేటరింగ్‌ చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థ..?

మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటుందని కేడియా చెప్పారు. గత రెండేళ్లలో మార్కెట్‌లో చాలా అనిశ్చితులు నెలకొన్నాయన్నారు. యుఎస్ మాంధ్యం, ద్రవ్యోల్బణం, కీలక వడ్డీరేట్లు, రెండు ప్రధాన దేశాల మధ్య యుద్ధాలు, ఎన్నికలు.. ఇవన్నీ మార్కెట్‌ను ప్రభావితం చేసినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement