Disney+ Hotstar Plans To Limit Account Sharing After Netflix - Sakshi
Sakshi News home page

Disney+ Hotstar: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్.. అదే జరిగితే వినియోగదారులకు కష్టమే!

Published Fri, Jul 28 2023 12:42 PM

Disney hotstar india planning limit account sharing system details - Sakshi

Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్‌స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్‌స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్‌వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్‌ వినియోగదారులకు కష్టతరమవుతుంది.

పాస్‌వర్డ్ షేరింగ్‌ విధానానికి నెట్‌ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్‌లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది.

(ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!)

కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్‌లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్‌స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement