Father of Hardware in India Ajai Chowdhry Inspirational Success Story - Sakshi
Sakshi News home page

ఒకప్పుడు రూ. 600 జీతం.. ఇప్పుడు కోట్ల సంపాదన - ఐఏఎస్ కొడుకు సక్సెస్ స్టోరీ!

Published Sat, Aug 19 2023 6:20 PM

Father of Hardware in India ajai chowdhry inspirational success story - Sakshi

HCL Co Founder Ajai Chowdary Success Story: ఈ రోజు మనకు 'ఫాదర్ ఆఫ్ హార్డ్‌వేర్ ఇన్ ఇండియా' అని చెప్పగానే 'అజయ్ చౌదరి' గుర్తుకు వస్తారు. అయితే ఈయన ఎవరు? ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి ఎదగటానికి చేసిన కృషి ఏమిటి? ఆయన సంపాదన వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ. 600 జీతానికి..
నిజానికి 'అజయ్ చౌదరి' ఒక ఐఏఎస్ అధికారి కొడుకు, ఇతడు ఒకప్పుడు రూ. 600 జీతానికి ఉద్యోగం చేసాడు. అయితే ఈ రోజు భారతదేశ ఐటి రంగంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. HCL టెక్నాలజీస్ వ్యవస్థాపక సభ్యులలో ఈయన కూడా ఒకరు కావడం గమనార్హం.

దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చి శరణార్థి శిబిరంలో నివసించిన కుటుంబానికి చెందిన అజయ్ చౌదరి ఈ రోజు కోటీశ్వరుల జాబితాలో ఒకరుగా నిలిచారు. జబల్‌పూర్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత చౌదరి తన కెరీర్‌ను ప్రారంభించాడు.

మైక్రో కాంప్ ప్రారంభం..
భారతీయ సాంకేతిక విప్లవంలో అతిపెద్ద వాటాదారులలో ఒకరుగా ఎదిగిన చౌదరి DCM డేటా ఉత్పత్తుల విక్రయాలలో వృత్తిని ప్రారంభించిన తరువాత నాడార్ & మల్హోత్రాతో ఏర్పడ్డ పరిచయం ఈయన జీవితాన్ని మార్చివేసింది. వీరు మొదటి స్టార్ట్ చేసిన కంపెనీకి 'మైక్రో కాంప్' అని పేరుపెట్టారు. ఆ తరువాత వీరు 1970లో హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్‌కి మరింత చిన్నగా 'HCL' అని నామకరణం చేశారు.

ఇదీ చదవండి: ఆలోచన ఏదైనా ఇట్టే పట్టేస్తుంది.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో ఏఐ ముందడుగు!

అంతర్జాతీయ విస్తరణ..
కేవలం రూ. 1.8 లక్షలతో ప్రారంభమైన హెచ్‌సీఎల్ నేడు ఏకంగా రూ. 3,20,000 కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో విక్రయాలకు సంబంధించి చౌదరి నాయకత్వం వహించారు. ఆ తరువాత అనతి కాలంలోనే అంతర్జాతీయంగా విస్తరించారు.

ఇదీ చదవండి: ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక.. యూఐడీఏఐ కీలక ప్రకటన

పద్మభూషణ్‌..
1999 - 2012 మధ్య హెచ్‌సిఎల్ ఛైర్మన్‌గా కూడా అజయ్ చౌదరి పనిచేశారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ పాట్నా వంటి సంస్థల బోర్డుల్లో పనిచేశారు. అంతే కాకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ఛైర్మన్‌గా.. ఐటీ మంత్రిత్వ శాఖ కోసం సెమీకండక్టర్ల సలహా బోర్డులో సభ్యుడుగా కూడా పనిచేశాడు. 2011లో భారత ప్రభుత్వం ఈయన సేవలకుగాను పద్మభూషణ్‌ అవార్డుని అందించింది.

 
Advertisement
 
Advertisement