స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్‌! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్‌!

Published Fri, Dec 15 2023 8:42 AM

Government Issues High risk Alert For Samsung Mobile Phone Users  - Sakshi

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్‌ జారీ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్‌లతో పాటు పాత ఫోన్‌లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్‌ నేరస్తులు లక్షల మంది శాంసంగ్‌ ఫోన్‌లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.

శాంసంగ్‌ ఫోన్‌ యూజర్లు ఏం చేయాలంటే 
శాంసంగ్‌ ఫోన్‌లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్‌ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్‌ సంగ్‌ ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 11,12,13,14లోని ఆపరేటింగ్‌ సిస్టంను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. 

శాంసంగ్‌ ఫోన్‌లపై దాడి.. ఆపై ఏం చేస్తారంటే?  
ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్‌ షిప్‌ ఫోన్‌ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్‌ల జాబితాలో ఉంది. ఫోన్‌ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్‌ నేరస్తులు ఫోన్‌లలోని డివైజ్‌ పిన్‌ను,  ఎమోజీ సాండ్‌బాక్స్‌ డేటాను అటాకర్లు చదవగలరు. సిస్టమ్‌ టైమ్‌ను మార్చి నాక్స్‌ గార్డ్‌ లాక్‌ను బైపాస్‌ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్‌, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్‌ ఇన్‌ పేర్కొంది.



మిగిలిన ఫోన్‌ యూజర్లు సైతం
అదే సమయంలో మిగిలిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు శాంసంగ్‌ ఫోన్‌ల నుంచి డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద లింకుల జోలికి పోవద్దని హెచ్చరించింది.  

Advertisement
Advertisement