భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి! | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి!

Published Thu, Apr 18 2024 8:13 PM

Infosys Employees Count Declines First Time in 23 Years - Sakshi

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. 2001 తరువాత కంపెనీ ఒక సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 7 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ కేవలం 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన Q4 అట్రిషన్ రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గిందని స్పష్టమవుతోంది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా గత వారం దాని Q4 ఫలితాలను వెల్లడించింది. ఇందులో కూడా ఉద్యోగుల సంఖ్య 13,249 మంది తగ్గినట్లు తెలిసింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ 1,759 మంది ఉద్యోగులను తగ్గించింది.

ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!

కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.

ఇక ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోంది. కంపెనీ లాభాలు అంతకు ముందు త్రైమాసికం కంటే 30 శాతం వృద్ధి చెంది రూ. 7969 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement