ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌పై Apna.co ఒక ఆన్‌లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్‌లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్‌కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్‌షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు.
40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్‌షిప్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది.
ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment