ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టా యాప్స్‌కు తీవ్ర అంతరాయం | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టా యాప్స్‌కు తీవ్ర అంతరాయం

Published Wed, Mar 6 2024 11:49 AM

Meta Apps Experience Major Outage - Sakshi

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్‌ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9 గంటలకు మెటా యాప్స్‌ సర్వీసుల్లో అంతరాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ ఔటేజ్‌ ట్రాకర్‌ ప్లాట్‌ఫాం డైన్‌ డిటెక్టర్‌ వెల్లడించింది.

మరోవైన తోటి సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో అంతరాయాలను వెక్కిరిస్తూ ఎలోన్‌మస్క్‌ స్పందించారు. ‘మీరు(యూజర్లు) ఈ పోస్టును చదువుతున్నారంటే మా సర్వర్లు పక్కాగా పని చేస్తున్నాయని అర్థం’ అంటూ పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ

మెటా స్పోక్స్‌పర్సన్‌ ఆండీస్టోన్‌ స్పందిస్తూ తమ యూజర్లు మెటా యాప్స్‌ ద్వారా సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement