ప్లాన్‌–3 | Sakshi
Sakshi News home page

ప్లాన్‌–3

Published Thu, May 9 2024 12:35 AM

ప్లాన

● మిగిలింది మూడు రోజులే ● దూసుకొస్తున్న గడువు ● వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ప్రచారం చేసేలా ప్రణాళిక ● రథాలు, సామాజిక మాధ్యమాలే కీలకం ● మండలాల వారీగా సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు

సాక్షి, పెద్దపల్లి: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఈనెల 13న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం.. 48 గంటల ముందే ఎ న్నికల ప్రచారం ముగించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తీర్ణం విశాలంగా ఉండడం, ఓ టర్ల సంఖ్య అధికంగా ఉండటంతో అభ్యర్థులు ప్రతీఓటరును నేరుగా కలిసే అవకాశం లేదు. దీంతో సభల నిర్వహణపైనే అభ్యర్థులు దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభల్లో పాల్గొన్ని పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం నింపారు. అయి తే, ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటివరకు ప్రచారమంతా మాటలతో సాగింది. ఓటర్లను పూర్తి స్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు చివరి అంకానికి తెరతీస్తున్నారు.

ఎక్కువ మందిని కలిసేలా..

● నగరాలు, పట్టణాలు, మండలాల్లో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసిసేలా అభ్యర్థులు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

● ఏ రోజు.. ఏ మండలంలో ప్రచారం నిర్వహించాలో షెడ్యూల్‌ సిద్ధం చేసుకుంటున్నారు.

● ముఖ్యంగా మండలాల వారీగా యువజన, మహిళా, కుల, యువజన సంఘాలతో భేటీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

● హామీలు గుప్పిస్తూ వారిని ఆకట్టుకోవాలని నిర్ణయించారు.

● సమయం తక్కువ ఉన్నందున అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేసే వీలులేకపోవటంతో వారి అనుచరులు, పార్టీ శ్రేణుల ద్వారా గడపగడపకూ తిరిగి ఓట్లు అభ్యర్థించే బాధ్యతలు అప్పగిస్తున్నారు.

● అలాగే పోలింగ్‌ కేంద్రాల వారీగా ఏజెంట్లను నియమించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మండల కేంద్రాలు, పట్టణాలు, నగరమే లక్ష్యం

అన్ని గ్రామాల్లో పర్యటించడం కష్టం కావటంతో మండల కేంద్రాలు, పట్టణాలు, రామగుండం నగరంలో సభలు నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా గ్రామాలమీదుగా, పట్టణాలు, నగరంలోని కాలనీల మీదుగా కార్నర్‌ మీటింగులు, ర్యాలీలు చేపడుతూ ప్రచారం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేసే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అప్పగించారు. మొత్తమ్మీద సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు, ప్రచార బాధ్యతలెత్తుకున్న నాయకులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ప్రచారం చివరిరోజు అధినేతల సభలు, రోడ్‌షోలు ఏర్పాటు చేయడం ద్వారా వీలైనన్ని ఎక్కువ ఓట్లు సాధించాలని అభ్యర్థులు భావిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో హీటెక్కిస్తున్నారు..

ఎండలకుతోడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య మాటల తూటాలతో లోక్‌సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

మంగళవారం కురిసిన అకాల వర్షంతో వాతావరణం చల్లబడినా.. పోలింగ్‌ ముగిసే వరకూ సోషల్‌ మీడియా వింగ్‌ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో మాటలు, తూటాలు, విమర్శనాస్త్రాలతో పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి.

తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా ప్రచార రథాలు, సోషల్‌ మీడియాపైనే అభ్యర్థులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ప్లాన్‌–3
1/1

ప్లాన్‌–3

Advertisement
 
Advertisement