బీఎల్‌వోలతో సమీక్ష | Sakshi
Sakshi News home page

బీఎల్‌వోలతో సమీక్ష

Published Thu, May 9 2024 12:35 AM

బీఎల్

జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం అ సెంబ్లీ నియోజకవర్గంలోని బూత్‌ లెవల్‌ అధికారులు(బీఎల్‌వో), సూపర్‌వైజర్లతో పోలింగ్‌ నిర్వహణ తీరుపై బుధవారం సమీక్షించారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ అరుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించా రు. ఆమె మాట్లాడుతూ, పోల్‌ స్లిప్పులను ప్రతీఓటరుకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలనానరు. ఓటింగ్‌ శాతం పేంచేలా కృషి చే యా లని కోరారు. రామగుండం తహసీల్దార్‌ కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

రైస్‌మిల్లులకు ధాన్యం తరలించండి

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): తూకం వేసిన వెంట నే ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాలని అ దనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ ఆదేశించా రు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌, సుగ్లాంప ల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. కోత లేకుండా మి ల్లర్లు ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు. సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు

గోదావరిఖని: జిల్లాలో ఈనెల 13న నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల్లో విధుల నిర్వహణ కో సం ఉద్యోగులను కేటాయించాలని ఎన్నికల సంఘం సిగరేణి యాజమాన్యాన్ని కోరింది. ఈమేరకు సంస్థవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో సెక్యూరిటీ, క్లరికల్‌, జనరల్‌ మజ్దూర్లను ఏరియాల వారీగా కేటాయించనుంది. అన్ని ఏరియాల నుంచి సిబ్బందిని కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 11 ఏరియాల్లోని 1100మందిని ఎన్నికల విధులకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇ టీవల గుర్తింపు యూనియన్‌ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌కుమార్‌.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని కోరారు. ఈక్రమంలో ఆన్‌డ్యూటీగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది.

‘మోదీ పాలనను ప్రశ్నించాలి’

పెద్దపల్లిరూరల్‌: పదేళ్ల మోదీ పాలనలో అవినీతిపై ప్రజలు ప్రశ్నించాలని తెలంగాణ పీపుల్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు కోరా రు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నాయకుడు మాదన కుమారస్వామి, టీ పీఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ గుమ్మడి కొమురయ్య త దితరులు బుధవారం కరపత్రం ఆవిష్కరించా రు. ప్రజల ఆకాంక్షలను కాదని ప్రధాని మోదీ ముస్లింలు, మంగళసూత్రాలు లాంటి అంశాల నే ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నా రని విమర్శించారు. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. నాయకులు రాజమల్లయ్య, మార్వాడి సుదర్శన్‌, గాండ్ల మల్లేశం, రామిళ్ల బాపు, రవీందర్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మామిడితోటల పరిశీలన

ధర్మారం(ధర్మపురి): ఈదురుగాలులతో కూడి న వడగళ్ల వర్షంతో నేలరాలిన మామిడితోటలను ఉద్యావనశాఖ అధికారి జ్యోతి బుధవారం పరిశీలించారు. బంజేరుపల్లి, గోపాల్‌రావుపేట, కటికెనపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేశారు. ఇప్పటికే తోటల్లోని మామిడికాయలు కోశారని, మిగిలిన కాయలు ఈదురుగాలులకు రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు.

నిర్భయంగా ఓటు వేయండి

పెద్దపల్లిరూరల్‌: ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని పెద్దపల్లి ఏసీసీ కృష్ణ కోరారు. సాయుధ బలగాల కవాతను జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం సాయుధ బలగాలతో రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కు వినయోగించుకోవాలని ఆయన కోరారు.

బీఎల్‌వోలతో సమీక్ష
1/2

బీఎల్‌వోలతో సమీక్ష

బీఎల్‌వోలతో సమీక్ష
2/2

బీఎల్‌వోలతో సమీక్ష

Advertisement
Advertisement