సాక్షి మనీ మంత్ర: ఆ షేర్ల నష్టంతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ఆ షేర్ల నష్టంతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం

Published Mon, Jan 8 2024 3:54 PM

today stock market closing - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ కంపెనీల షేర్లు నష్టపోవడమే నేటి పతనానికి కారణంగా భావించవచ్చు.

నిఫ్టీ 199.70 పాయింట్లు లేదా 0.92 శాతం నష్టంతో 21,511.10 పాయింట్ల వద్ద ముగియగా సెన్సెక్స్ 665.73 పాయింట్లు లేదా 0.92 శాతం నష్టపోయి 71,360.42 పాయింట్ల వద్ద ముగిసింది.

అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్‌, ఎన్‌టీపీసీ షేర్లు ఈరోజు టాప్‌ గెయినర్స్‌గా ఉండగా, యూపీఎల్‌, ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, బ్రిటానియా షేర్లు టాప్‌ లూజర్స్‌ జాబితాలో చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
 
Advertisement