నన్నయ వీక్షిత్‌ భారత్‌ | Sakshi
Sakshi News home page

నన్నయ వీక్షిత్‌ భారత్‌

Published Tue, Apr 23 2024 8:10 AM

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు  - Sakshi

రాజానగరం: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. యూనివర్సిటీ 18వ ఫౌండేషన్‌ డేని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన వీక్షిత్‌ భారత్‌ థీమ్‌ కార్యక్రమాలను వీసీ ప్రారంభించారు. శ్రీరాపర్తి రామ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కానవరం విద్యార్థులు ఉదయం యోగ ఆసనాలు వేయించి, యోగ సాధన ఆవశ్యకతను తెలియజేశారు. మధ్యాహ్నం వీక్షిత్‌ భారత్‌ 2047 థీమ్‌ ఓరియెంటెడ్‌ డాన్స్‌, మైమ్‌, స్కిట్స్‌లను క్యాపంస్‌, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించారు. సీటీఆర్‌ఐ డైరెక్టర్‌ ఎం.శేషుమాధవ్‌ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆవిర్భావ లక్ష్యాలను నెరవేర్చే దిశగా యువత పయనించాలని సూచించారు. యూజీసీ వీక్షిత్‌ భారత్‌ జాబితాలో శ్రీనన్నయశ్రీ వర్సిటీ ఉండటం హర్షణీయమన్నారు. సీఎస్‌ఐఆర్‌ రిటైర్డ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి. భగవాన్‌ నారాయణ రీసెర్చ్‌ మెథడాలజీపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రిజిస్టార్‌ ఆచార్య జి.సుధాకర్‌, డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి, డాక్టర్‌ రామచంద్రరాజు, డాక్టర్‌ సీహెచ్‌.సత్యనారాయణ, డాక్టర్‌ రామరాజు ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

Advertisement
Advertisement