వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు

Published Wed, May 8 2024 4:55 AM

వైఎస్

పెదవేగి: వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెదవేగి మండలంలోని రామసింగవరంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 179 జగనన్న కొఠారు కాలనీలు ఏర్పాటుచేశామని, 25 వేల మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చామని చెప్పారు. రూ.18 కోట్లతో తమ్మిలేరుపై బలివే బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌లు, సీసీ రో డ్లు, గ్రావెల్‌ రోడ్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. వి ద్యుత్‌ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రూ.250 కోట్లతో 5 కొత్త సబ్‌స్టేషన్‌లను నిర్మించడంతోపాటు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, వందల కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లు వేయించామన్నారు. ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

జంగారెడ్డిగూడెం రూరల్‌: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్‌ పథకాలు అమలు చేశారని వైఎస్సార్‌ సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం, తిరుమలాపురం, శోభనాద్రిపురం, కృష్ణంపాలెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలనను చేరువ చేశారన్నారు. అర్హులందరికీ నవరత్నాల పథకాలు చేరువయ్యాయన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారతకు పెద్దపీట వేశారన్నారు. సంక్షేమం, అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే జగన్‌ను మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఎంపీపీ కొదమ జ్యోతి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జి, సర్పంచ్‌ కనుపర్తి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ నరెడ్ల బుచ్చిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మండల యూత్‌ అధ్యక్షుడు ఎలికే పవన్‌ కుమార్‌, నాయకులు ఉన్నారు.

మండవల్లి: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కోరారు. మండవల్లి మండలంలోని నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కై కలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌), ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌ యాదవ్‌కు భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. జగన్‌ మరోమారు ముఖ్య మంత్రి అయితేనే పథకాలన్నీ కొనసాగుతున్నాయన్నారు. ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్‌, గ్రామ పెద్దలు ముసరబోయిన బ్రహ్మయ్య, బసవయ్య, నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ఘంటసాల దుర్గాప్రసాద్‌, బాలశౌరి, సర్పంచ్‌లు సైదు చంద్రయ్య, నాగేశ్వరరావు, జయమంగళ కాసులు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
1/2

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
2/2

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రచార జోరు

Advertisement
 
Advertisement
 
Advertisement