అనంత్‌-రాధిక పెళ్లి : తల్లిగా నీతా అంబానీ రెండు కోరికలు | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధిక పెళ్లి : తల్లిగా నీతా అంబానీ రెండు కోరికలు

Published Fri, Mar 1 2024 12:26 PM

Anant Ambani Radhika Merchant Wedding Nita Ambani two Wishes - Sakshi

ఊపందుకున్న అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు

చిన్నకుమారుడు  అనంత్‌ అంబానీ  పెళ్లి వేడుకలపై తొలిసారి స్పందించిన నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లి సందడి  జోషే  వేరుగా ఉంది. రోజుకో విశేషం  వార్తల్లో నిలిచింది.   ఈఏడాది జూన్‌లో జరగనున్న   అనంత్‌- రాధికా పెళ్లికి సంబంధించి ప్రతీ వేడుక ముచ్చటగా నిలుస్తోంది. వివాహ వేడుకు కంటే ముందు ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఆకర్షణీయంగా  నిలుస్తున్నాయి.   

వ్యాపారవేత్త అనంత్‌ అంబానీ , పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె  రాధిక మర్చంట్‌ వెడ్డింగ్‌ బెల్స్‌కు  ముహూర్తం  ఖరారైన ఈ నేపథ్యంలో  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు షురూ అయ్యాయి.  జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో జరిగే మూడు రోజుల ఈ వేడుకలకు ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ జామ్‌నగర్‌ చేరుకుంది. బుధవారం వేలాదిమందికి అన్నసేవతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అటు అతిథులు సైతం ఒక్కొక్కరుగా జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుక్ ఖాన్, దీపికా పదుకొనే, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ  సహా దాదాపు 2వేల మంది అతిథులు హాజరుకానున్నారు.

 ఆ రెండు ఆకాంక్షలతోనే  జామ్‌నగర్‌లో..
ఇవన్నీ ఒక ఎత్తయితే అనంత్‌ అంబానీ తల్లి, నీతా అంబానీ విడుదల చేసిన స్పెషల్‌ వీడియో సందేశం ఇంటర్నెట్‌లో వైరల వుతోంది. జామ్‌నగర్‌లోనే ధీరూభాయ్‌  అంబానీ, ముఖేష్‌ రిలయన్స్‌ సామ్రాజాన్ని నిర్మించారు. తన కరియర్‌ కూడా అక్కడే మొదలైందనీ, అందుకే ఈ వారసత్వాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు.  అలాగే ఎడారి లాంటి ప్రదేశాన్ని పచ్చని ప్రకృతితో అలరారేలా రిలయన్స్‌ గ్రీన్స్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. అలాగే కళలు, సంస్కృతీ సంప్రదాయాలంటే ఇష్టపడే  నీతా అంబానీ ఈ వారసత్వాన్ని ప్రతిబింబించేలా తన తనయుడి పెళ్లి ముచ్చట ఉండాలని కోరు కుంటున్నారట. తమ మూలాల్ని గుర్తించుకునేలా కూడా వేడుకలు ఘనంగా ఉండాలని భావిస్తున్నామన్నారు.  అందుకే గుజరాత్‌లోని రిలయన్స్‌ గ్రీన్స్‌ను వేదికగా  ఎంచుకున్నామని ఆమె ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement