ముఖం ముత్యంలా కాంతిగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి! | Sakshi
Sakshi News home page

ముఖం ముత్యంలా కాంతిగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

Published Thu, Jan 25 2024 11:41 AM

Homemade Face Packs For Glowing Skin - Sakshi

పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని ముత్యంలా మెరిసేలా చెయ్యొచ్చు. పైగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉండవు. ఇంతకీ ఆ హెర్బల్‌ ఫేస్‌ప్యాక్‌లు ఏంటో చూద్దామా!.

ఇంట్లో రోజూ వాడే వాటితోనే చేసుకోగలిగిన ట్రీట్‌మెంట్‌లు. ఇక్కడ ఇచ్చినవన్నీ  ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేని హెర్బల్‌ ఫేస్‌ప్యాక్‌లు.

  • చందనం ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంతోపాటు మొటిమలు, యాక్నేతోపాటు వేడితో చర్మం పొంగినప్పుడు వచ్చిన ఎర్రటి మచ్చలను కూడా తొలగిస్తుంది. చందనంలో పన్నీరు కలిపి ప్యాక్‌ వేస్తుంటే  మంచి ఫలితాన్నిస్తుంది. ఎండకాలంలో ఈ ప్యాక్‌ వేస్తుంటే శరీరానికి చల్లదనాన్నిస్తుంది.
  • బొప్పాయి చెక్కు, అరటి తొక్కలు కూడా సౌందర్య సాధనాలే. వీటిని లోపలి వైపు (గుజ్జు ఉండే వైపు) చర్మానికి అంటేలా రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా ముఖం స్వచ్ఛంగా ముత్యంలా మెరుస్తుంది.
  • ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో ఒక టీ స్పూన్‌ పాలపొడి కాని తాజా పాలు కాని కలిపి ముఖానికి అప్లయ్‌ చేసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తుంటే రెండు వారాలకు ఇనుమడించిన చర్మకాంతి స్పష్టంగా కనిపిస్తుంది.
  •   చర్మాన్ని నునుపుగా కాంతివంతంగా చేయడంలో కమలా, బత్తాయిపండ్లు బాగా పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రసాన్ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకుని ముఖానికి రాసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇవి ముఖాన్ని క్లియర్‌గా చేయడంతోపాటు స్కిన్‌ టోనర్‌గా కూడా పనిచేస్తాయి. 

(చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?)

Advertisement
Advertisement