హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా! | Ira Khan And Nupur Shikhare Wedding In Udaipur, Aamir Khan Gets Emotional Video Goes Viral - Sakshi
Sakshi News home page

హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!

Published Thu, Jan 11 2024 12:13 PM

 IraKhan Nupur Shikhare Wedding bollywood star hero Aamir Khan gets emotional goes viral - Sakshi

బాలీవుడ్‌  స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌  కుమార్తె ఇరా ఖాన్‌  వివాహానికి సంబంధించిన వార్తలు  సోషల్‌మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.  ముఖ్యంగా  వరుడు  ఫిట్‏నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare) జాగింగ్‌ చేసుకుంటూ పెళ్లి మండపానికి రావడం, అలాగే వధువు ఇరాఖన్‌ చాలా సాదాసీదా కనిపించడం తన మాజీ భార్యలు రీనాదత్తా, కిరణ్‌రావు సందడిగా కనిపించడం విశేషంగా నిలిచింది. తాజా  మరో విషయం నెటిజనులను కూడా భావోద్వేగానికి గురిచేస్తోంది.

ప్రతీ ఇంటికి ఆడబిడ్డ అంటే మురిపెం. అడిగింది కాదనకుండా అల్లారుముద్దుగా పెంచుకుంటారు.  కానీ పెళ్లీడు వచ్చి ఒక అయ్యలో చేతిలో పెట్టి అత్తారింటికి పంపే క్రమంలో మాత్రం తన ప్రాణమే పోతున్నంత బాధపడతారు.  ముఖ్యంగా తండ్రులు బరువెక్కిన గుండెలతో భావోద్వేగానికి గురవుతుంటారు.  ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అని ఓ సినీ కవి అన్నట్టు తాజాగా తన కుమార్తె పెళ్లిలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) కూడా కంటతడి పెట్టుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

 ఇప్పటికే రిజిస్టర్‌  మ్యారేజ్‌ చేసుకున్న ఇరా-నూపుర్‌  జంట బుధవారం ఉదయపూర్‌లో ఉంగరాలు మార్చుకుని మరో వివాహ వేడుకను జరుపుకున్నారు. ఈ సమయంలో  పెళ్లికూతురు తండ్రి అమీర్ ఖాన్  ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. అమీర్ , తన మాజీ భార్య రీనా దత్తాతో కలిసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement