'బంగారం'లాంటి అవకాశం.. గోల్డ్ ఇప్పుడైనా కొనొచ్చు! | Today Gold and Silver Price On 14 June 2024 | Sakshi
Sakshi News home page

Gold and Silver Price: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి - నేటి కొత్త ధరలు ఇలా..

Published Fri, Jun 14 2024 11:44 AM | Last Updated on Fri, Jun 14 2024 12:06 PM

Today Gold and Silver Price On 14 June 2024

జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు (జూన్ 14) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

శుక్రవారం విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65900 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.71890 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66050 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72040 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 270 తగ్గింది.

చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110తగ్గి.. రూ. 66500 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 72550 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 14) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ. 200 తగ్గినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు అవగతం అవుతోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement