ప్రైవేటు వ్యక్తులు.. ఎన్నికల విధుల్లో.. | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వ్యక్తులు.. ఎన్నికల విధుల్లో..

Published Tue, Apr 23 2024 8:20 AM

గుర్తింపు కార్డుతో    కె.బాబూరావు 
 - Sakshi

ప్రత్తిపాడు: నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నిర్వాకంతో ప్రైవేటు వ్యక్తులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ప్రైవేట్‌ వ్యక్తులకు ఎన్నికల విధులు కేటాయించడమే కాకుండా, వారికి వీఆర్‌ఏ హోదా కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు జారీచేశారు. ప్రత్తిపాడులో వెలుగుచూసింది.

వివరాలు.. ప్రత్తిపాడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియలో ప్రత్తిపాడుకు చెందిన కె.బాబూరావు, యనమదల గ్రామానికి చెందిన ఎమ్మెల కోటయ్యప్రైవేటు వ్యక్తులకు ఎన్నికల సిబ్బందిగా విధులు కేటాయించారు. అంతేకాకుండా వీఆర్‌ఏ హోదా ఇచ్చి గుర్తింపు కార్డులు జారీ చేసి దానిపై ఆర్వో సంతకం చేసి మరీ వారి చేతికిచ్చారు. ఒక పక్క ఎన్నికల సంఘం వలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆర్వో శ్రీకర్‌కు మాత్రం అవేమీ పట్టన్నట్లుగా ప్రైవేట్‌ వ్యక్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేసి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. దీంతో సదరు ప్రైవేటు వ్యక్తులు దర్జాగా నామినేషన్ల సమయంలోనూ మెడలో ఐడెంటిటీ కార్డులు వేసుకుని ఆర్వో కార్యాలయంలో చక్కర్లు కొట్టేస్తున్నారు. అయితే పై విషయమై ఆర్వో పి.శ్రీకర్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా ఎన్నో సంతకాలు సంతకాలు పెడుతుంటాను. సంతకాలు పెట్టేటప్పుడు అన్నింటి మీదా డిజిగ్నేషన్‌ చూడలేను కదా. అయినా ఒక్కసారి అలా ఎవరికి ఇచ్చామో పరిశీలిస్తానని చెప్పారు.

వీఆర్‌ఏ హోదాతో ఐడెంటిటీ కార్డులు జారీ చేసిన ప్రత్తిపాడు ఆర్వో శ్రీకర్‌ నామినేషన్ల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చెలామణీ ఆర్వో నిర్వాకంతో విస్తుపోతున్న సిబ్బంది, ఉద్యోగులు ఎన్నికల నియమావళికి ఇది పూర్తి విరుద్ధమంటూ విమర్శలు

గుర్తింపు కార్డుతో ఎమ్మెల కోటయ్య
1/3

గుర్తింపు కార్డుతో ఎమ్మెల కోటయ్య

వీఆర్‌ఏగా ఆర్వో శ్రీకర్‌ జారీ చేసిన గుర్తింపు కార్డు
2/3

వీఆర్‌ఏగా ఆర్వో శ్రీకర్‌ జారీ చేసిన గుర్తింపు కార్డు

వీఆర్‌ఏగా గుర్తింపు కార్డు జారీ చేసిన ఆర్వో శ్రీకర్‌
3/3

వీఆర్‌ఏగా గుర్తింపు కార్డు జారీ చేసిన ఆర్వో శ్రీకర్‌

Advertisement
Advertisement