ఫ్రీ పాస్‌పోర్ట్‌, నో ట్యాక్స్‌.. ఓ దేశం బంపరాఫర్‌! | El Salvador Offering 5000 Free Passports To Highly Skilled Workers From Abroad, More Details Inside - Sakshi
Sakshi News home page

EI Salvador Free Passports: ఫ్రీ పాస్‌పోర్ట్‌, నో ట్యాక్స్‌.. ఓ దేశం బంపరాఫర్‌!

Published Sun, Apr 7 2024 10:52 AM

El Salvador offering 5000 free passports to highly skilled from abroad - Sakshi

సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్‌ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు  ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు.

"విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను (మా పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో 5 బిలియన్‌ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం.  ఓటింగ్ హక్కులతో సహా  ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్‌ బుకెలే ‘ఎక్స్‌’లో ద్వారా ప్రకటించారు. 

అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు.

Advertisement
Advertisement