రూ. 3 కోట్ల లాటరీ.. భర్త ఇంటికి రావడంతో ఊహించని షాకిచ్చిన భార్య! | Sakshi
Sakshi News home page

రూ. 3 కోట్ల లాటరీ.. భర్త ఇంటికి రావడంతో ఊహించని షాకిచ్చిన భార్య!

Published Wed, Mar 22 2023 12:46 PM

Husband Shocked As Wife Marries Another Man After Wins Rs 3 Crore Lottery Thailand - Sakshi

సుమారు రూ.3 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్న ఓ భార్య ఈ విషయాన్ని భర్త దగ్గర దాచిపెట్టి సర్‌ప్రైజ్‌ కాదు పెద్ద షాక్‌ ఇచ్చింది. అసలు విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి తన భార్యపై దావా వేశాడు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో  చోటు చేసుకుంది. అసలు వీళ్ల కథేంటంటే.. వివరాల్లోకి వెళితే.. థాయ్‌ల్యాండ్‌లో నివసిస్తున్న నారిన్‌కి 20 ఏళ్ల క్రితం చవీనాన్‌ అనే మహిళతో వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వారికి పెద్ద మొత్తంలో అప్పులు ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లు.

కుటుంబ పోషణతో పాటు అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకుని.. ఈ క్రమంలో సంపాదన కోసం భార్యాభర్తలు 2014లో దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే కొన్ని రోజులు తర్వాత నరిన్ దక్షిణ కొరియాలో పని చేస్తూనే ఉండగా, అతని భార్య మాత్రం కుమార్తెలను చూసుసుకునేందుకు తిరిగి థాయ్‌లాండ్‌కు వచ్చేసింది. కుటుంబం కోసం ప్రతి నెల నరిన్ ప్రతి నెలా దాదాపు డబ్బులు పంపేవాడు. చవీవాన్ లక్కీగా లాటరీలో రూ.2.9 కోట్లు గెలుచుకుంది. అయితే ఈ గుడ్‌న్యూస్‌ తన భర్తకి చెప్పలేదు.  కొన్ని రోజుల తర్వాత లాటరీని విషయాన్ని చవీనాన్‌ దాచిందని తన కుమార్తెల ద్వారా నరిన్‌ తెలుసుకున్నాడు.

ఇది తెలుసుకునేందుకు ఆమెకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదు. చివరికి మార్చి 3న అతను థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అయితే తన భార్య ఫిబ్రవరి 25న తన ప్రియుడిని వివాహం చేసుకున్నట్లు తెలిసి షాకయ్యాడు. దీనిపై నరీన్‌ స్పందిస్తూ.. ‘నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఏం చేయాలో తెలియడం లేదు. మా 20 ఏళ్ల వైవాహిక జీవితంలో తన భార్య ఇలా చేస్తుందని ఏరోజూ ఊహించలేదు. నా బ్యాంకు ఖాతాలో కూడా ప్రస్తుతం పెద్దగా నగదు లేదు. తను మోసం చేసింది. అందుకే న్యాయం కోసం ఆమెపై కోర్టులో దావా వేశా’ అని అతడు వాపోయాడు. పోలీసులు, ఇతర సంబంధిత శాఖలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement