ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం.. అందుకు ప్రతీకారమే..! | Russia Launched Fresh Stikes On Ukrain Capital Kyuv And Lviv On Sunday, Details Inside - Sakshi
Sakshi News home page

Russia Ukrain War :ఉక్రెయిన్‌పై రష్యా తాజా దాడులు

Published Sun, Mar 24 2024 12:28 PM

Russia Fresh Stikes On Ukrain Capital - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై ఆదివారం(మార్చ్‌ 24)రష్యా తాజాగా మిసైళ్లతో విరుచుకుపడింది. కీవ్‌తో పాటు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్‌వివ్‌పై రష్యా దాడులు చేసింది. కీవ్‌లో రష్యా దాడుల కారణంగా పలు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయని  నగర మేయర్‌ విటాలి క్లిట్‌ష్కో తెలిపారు.

అయితే ఈ దాడుల్లో  ఎవరూ మృతి చెందలేదని, పెద్దగా నష్టమేమీ జరగలేదని కీవ్‌ చీఫ్‌ మిలిటరీ ఆఫీసర్‌ చెప్పారు. రష్యా మిసైళ్లను తమ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ కూల్చివేసిందని తెలిపారు. ఇటీవల తమ దేశంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్‌ కావాలని దాడులు చేసిందని రష్యా ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. 

ఈ దాడులపై రష్యా ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. రష్యా  తాజా దాడులతో ఉక్రెయిన్‌ పొరుగు దేశమైన పోలండ్‌ అలర్ట్‌ అయింది. తమ ఆకాశంలోకి ఇతర దేశాల  యుద్ధ విమానాలు ప్రవేశించకుండా నిఘా పెట్టింది. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం 2022 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు 

Advertisement
 
Advertisement
 
Advertisement