21న ఐఎన్టీయూసీ మహాసభ | Sakshi
Sakshi News home page

21న ఐఎన్టీయూసీ మహాసభ

Published Fri, Apr 19 2024 1:45 AM

-

మందమర్రిరూరల్‌: ఈ నెల 21న గోదావరిఖ నిలో నిర్వహించే ఐఎన్టీయూసీ మహాసభను సి ంగరేణి కార్మికవర్గం విజయవంతం చేయాలని ఆ సంఘం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాంపెల్లి సమ్మయ్య కోరారు. గురువారం ఏరియాలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమ్మయ్య మాట్లాడారు. కార్మి కుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ మందమర్రి బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, నాయకులు నరేందర్‌, సూర్యనారాయణ, లక్ష్మణ్‌ తిరుపతి, రాజన్న, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

అవార్డుకు ఎంపిక

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌కు చెందిన జేసీఐ మంచిర్యాల జిల్లా కన్వీనర్‌ ఆరుముల్ల రాజు బూస లక్ష్మయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నందుకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ చైర్మన్‌ బూస ప్రదీప్‌, కోఆర్డినేటర్‌ దేవిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపారు.

నేడు కార్యదర్శుల సమావేశం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బి.సంతోష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈజీఎస్‌పై కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంచాయతీ ప్రణాళిక, క్షేత్ర సహా యకులతో తయారు చేసిన అభివృద్ధి పనుల ని వేదిక, గ్రామసభలు నిర్వహించి పనులు ఆమోదించడం, జాబ్‌కార్డుల అప్‌గ్రేడ్‌, కొత్త జాబ్‌కార్డు కోసం దరఖాస్తులు తీసుకోవడం, ఉపాధి కూలీలు పనులకు వచ్చేలా చైతన్యం చేయ డం, ఏడు రిజిష్టర్ల నిర్వహణ, వారాంతపు స మావేశాల నిర్వహణ తదితర వాటిపై పూర్తి స్థాయి సమీక్ష ఉంటుందని తెలిపారు. సమావేశానికి కార్యదర్శులు తాజా నివేదికలతో హాజరు కావాలని తెలిపారు.

మృతుడి ఆచూకీ లభ్యం

మంచిర్యాలక్రైం: ఈ నెల 16న స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో మృతిచెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. ఎస్సై లక్ష్మణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సమాచారం మేరకు బస్టాండ్‌లో పరిశీలించగా వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపర్చారు. పత్రిక ప్రకటనల ఆధారంగా మృతుడి బంధువులు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించారు. మృతుడిని పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట్‌ గ్రామానికి చెందిన కొమ్ము రాజేందర్‌గా గుర్తించారు. వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవాడు. తన స్నేహితుడిని కలిసేందుకు మంచిర్యాలకు వచ్చి బస్టాండ్‌లో చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement