ఐఎన్టీయూసీ సభ్యత్వ నమోదు | Sakshi
Sakshi News home page

ఐఎన్టీయూసీ సభ్యత్వ నమోదు

Published Fri, Apr 19 2024 1:45 AM

 సభ్యత్వ నమోదు చేస్తున్న  నాయకులు 
 - Sakshi

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ 3 గనిలో ఐఎన్టీయూసీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు మాట్లాడుతూ కార్మికులకు ఐఎన్టీయూసీ అనేక హక్కులు సాధించిన చరిత్ర ఉందన్నారు. ఈ నెల 21న గోదావరిఖనిలో సెంట్రల్‌ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్కే 7 గనిలో యూనియన్‌ కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, గరిగే స్వామి, ఫిట్‌ సెక్రెటరీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఎస్సార్పీ 3 గనిలో యూనియన్‌ బ్రాంచీ కార్యదర్శి ఫిట్స్‌ సెక్రెటరీలు శ్రీను, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement