స్విస్‌ బ్యాంక్‌లో నల్లధనం తెచ్చేదెన్నడు? | Sakshi
Sakshi News home page

స్విస్‌ బ్యాంక్‌లో నల్లధనం తెచ్చేదెన్నడు?

Published Thu, May 9 2024 8:25 AM

స్విస్‌ బ్యాంక్‌లో నల్లధనం తెచ్చేదెన్నడు?

గుడ్లవల్లేరు: స్విస్‌ బ్యాంక్‌లో ఎంతో కాలంగా మూలుగుతున్న దేశంలోని వివిధ రంగాలకు చెందిన ధనవంతుల నల్లధనాన్ని తెచ్చి, పేదలకు పంచిపెడతానని ప్రధాని నరేంద్ర మోదీ 2014లో ఇచ్చిన హామీ ఎందుకు అమలుకాలేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు లింగం జాన్‌బెన్నీ ప్రశ్నించారు. గుడ్లవల్లేరులోని వైఎస్సార్‌ సీపీ ఎన్ని కల కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. మరోసారి చంద్రబా బుతో పొత్తు పెట్టుకోవటంతో మోదీపై రాష్ట్ర ప్రజలు మరింతగా నమ్మలేక కోల్పోయారని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమం అందిస్తే శ్రీలంక అయిపోతుందన్న బాబు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్ని కల్లో ఏం చెబితే అది చేశారని గుర్తుచేశారు. వైఎస్‌ జగన్‌పై విశ్వాసంతో ఆయన్నే మళ్లీ సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా రని తెలిపారు. పాస్టర్లు ముత్యాల జయరాజు, ఇమ్మానియేలు, ప్రభాకర్‌, రంగాప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ నాయకుడు శాయన దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement