ఆడవారు అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందులోనూ సెలబ్రిటీలు అందం కోసమే ఖర్చు చేస్తారు.. అందంగా కనిపించేందుకే ఎక్కువ తాపత్రయపడతారు. కొందరైతే ప్లాస్టిక్ సర్జరీల దాకా వెళ్తారు. ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. పొరపాటున ఫేస్‌లో ఏదైనా మార్పు కన్పిస్తే చాలు నెటిజన్లు సెలబ్రిటీలను తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ వైఖరిపై బిగ్‌బాస్ బ్యూటీ జాస్మిన్ భాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నెగెటివిటీ!
'జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ముఖం పట్టుకుని నానామాటలు అనేస్తున్నారు. నటీనటులుగా, సెలబ్రిటీలుగా మేము జనాల్లోనే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకని ఎప్పుడూ నెగెటివిటీ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. యాక్టర్స్‌గా అందంగా కనిపించడం మా బాధ్యత. అందవిహీనంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారా? మా ప్రొఫెషనల్‌లో అందానికి పెద్ద పీట వేస్తాం. ఎప్పటికప్పుడు అందాన్ని పెంపొందించుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంతగానో కష్టపడతాం.
చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?
నోటికొచ్చింది అనేస్తున్నారు
శరీరంలోని మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల మేమెంత ఇబ్బందిపడుతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది తిడుతున్నారు. అప్పటికే మేమెంతో ఒత్తిడిలో ఉంటాం. దానికి తోడు మీ ట్రోలింగ్ వళ్ల ఇంకెంత హర్ట్ అవుతామో ఆలోచించారా? దీనివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఇంత బాధపెట్టడం మీకు న్యాయమేనా?' అని జాస్మిన్ ప్రశ్నించింది.
చదవండి: స్టార్ హీరోయిన్‌ను పట్టించుకోని డెలివరీ బాయ్.. నెటిజన్ల ప్రశంసలు!
Comments
Please login to add a commentAdd a comment