కళ్లకు లెన్స్ వాడుతున్నారా? టాలీవుడ్ హీరోయిన్‍‌కి ఏం జరిగిందో తెలిస్తే! | Actress Jasmin Bhasin Lens Issue With Eye Sight | Sakshi
Sakshi News home page

Jasmin Bhasin: లెన్స్ పెట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడేమో కళ్లు కనిపించట్లేదు!

Published Sun, Jul 21 2024 12:38 PM | Last Updated on Sun, Jul 21 2024 1:18 PM

Actress Jasmin Bhasin Lens Issue With Eye Sight

చూపు స్పష్టంగా ఉండేందుకు చాలామంది కళ్లద్దాలు ఉపయోగిస్తుంటారు. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కళ్లాద్దాలు బదులు లెన్స్ ఉపయోగించడం. వీటిని పెట్టుకున్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రం వీటి వల్ల ఏకంగా కంటి చూపు పోయే పరిస్థితి వస్తుంటుంది. తాజాగా ఓ యంగ్ హీరోయిన్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. లెన్స్ వల్ల తనకు కళ్లు కనిపించట్లేదని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)

'జూలై 17న ఈవెంట్ కోసం ఢిల్లీలో ఉన్నాను. రెడీ అవుతున్న టైంలో లెన్స్ పెట్టుకోగానే ఎందుకు నొప్పిగా అనిపించింది. నిమిష నిమిషానికి బాగా ఎక్కువైపోయింది. దీంతో ఈవెంట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకుని మేనేజ్ చేశారు. ఓ సమయంలో నాకేం కనిపించలేదు. అలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. అయితే ఈ నొప్పి తగ్గడానికి 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా పట్టడం లేదు' అని జాస్మిన్ బాసిన్ చెప్పుకొచ్చింది.

ఈమె లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దక్షిణాదిలో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన జాస్మిన్.. తెలుగులో 'వేట', 'లేడీస్ & జెంటిల్మన్' మూవీస్ చేసింది. వీటితో పాటు బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement