బెస్ట్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే.. గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన నటి | Actress Jasmin Bhasin Gift Gold Earrings To Bharti Singh On Her Birthday, Deets Inside | Sakshi
Sakshi News home page

కమెడియన్‌ బర్త్‌డే.. ఇంటికి పిలిచి మరీ గిఫ్టిచ్చిన బ్యూటీ

Published Sat, Jul 13 2024 6:47 PM | Last Updated on Sat, Jul 13 2024 7:21 PM

Jasmin Bhasin Gift Gold Earrings To Bharti Singh On Her Birthday

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటేనే ఒకరికోసం మరొకరు నిలబడుతారు. సంతోషమొచ్చినా, బాధొచ్చినా అన్నీ పంచుకుంటారు. బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. బుల్లితెర నటి జాస్మిన్‌ భాసిన్‌, కమెడియన్‌ భారతి సింగ్‌ ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌. భారతి బర్త్‌డే రోజు ఇంటికి జాస్మిన్‌ తల్లి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది.

నటి జాస్మిన్‌ భాసిన్‌

సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌
రుచికరమైన భోజనం వడ్డించిన తర్వాత స్నేహితురాలికి మంచి బహుమతిచ్చింది జాస్మిన్‌. భారతి బర్త్‌డే కావడంతో తనకు బంగారు చెవి కమ్మలను గిఫ్టిచ్చింది. అది చూసిన హాస్య నటి తెగ మురిసిపోయింది. గొప్ప బహుమతిచ్చినందుకు జాస్మిన్‌కు, కడుపునిండా భోజనం పెట్టినందుకు ఆమె తల్లికి కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి స్నేహితురాలు ఉన్నందుకు ఎంతో అదృష్టవంతురాలినని పొంగిపోయింది.

కమెడియన్‌ భారతి సింగ్‌

కెరీర్‌
ఇకపోతే జాస్మిన్‌ బుల్లితెర షోలతో పాటు సీరియల్స్‌లోనూ నటించి పాపులారిటీ సంపాదించుకుంది. భారతి సింగ్‌ విషయానికి వస్తే కామెడీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంది. ద కపిల్‌ శర్మ షో, కామెడీ నైట్స్‌ బచావో వంటి షోలతో జనాలకు దగ్గరైంది. అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది.

చదవండి: 15 ఏళ్లలోనే తొలిసారి.. అత్యంత దారుణమైన కలెక్షన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement