పాయల్‌తో ఆది సాయి కుమార్ రొమాన్స్‌.. ఆసక్తిగా 'తీస్‌ మార్‌ ఖాన్‌' టీజర్‌ | Sakshi
Sakshi News home page

Tees Maar Khan Teaser: రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి.. ఆసక్తిగా టీజర్

Published Sat, Jun 18 2022 2:57 PM

Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released - Sakshi

Aadi Sai Kumar Tees Maar Khan Teaser Released: 'ప్రేమ కావాలి' సినిమాతో హీరోగా పరిచయమైన ఆది సాయి కుమార్ లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో అలరించాడు. ఇటీవల 'బ్లాక్' మూవీతో సందడి చేసిన ఆది సాయి కుమార్‌ అంతగా మెప్పించలేకపోయాడు. అయితే జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో ముందుకు పోతున్నాడు ఆది. ప్రస్తుతం ఆది సాయి కుమార్‌ చేతిలో తీస్‌ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెలో తదితర చిత్రాలు ఉన్నాయి. తాజాగా 'తీస్‌ మార్ ఖాన్' మూవీ టీజర్‌ రిలీజ్‌ అయింది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో ఆది తీస్‌ మార్‌ ఖాన్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడు. 

'రాక్షసుడికి రక్షకుడంటే ఏంటో చూపించాలి' అంటూ డైలాగ్‌తో వచ్చే ఆది ఎంట్రీ బాగుంది. ఇందులో అనూప్ సింగ్‌ ఠాకూర్‌ విలన్‌గా అలరించనున్నాడు. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కల్యాణ్‌ జి గొగణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్, పూర్ణ, కబీర్‌ సింగ్‌ కీలక పాత్రు పోషిస్తున్నారు. 

చదవండి: ఆ హీరోలా ఎఫైర్స్‌ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్‌
సైలెంట్‌గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్‌..


Advertisement
 

తప్పక చదవండి

Advertisement