సాక్షి, ఖమ్మం: సీఎం రేవంత్‌కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేస్తమన్నారు.. ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనిపేర్కొన్నారు.
ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హామీలను, గ్యారంటీలను ఏ ఒక్కటి అమలు చేసే పరిస్థితిలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, రెండు పార్టీలకు నైతిక విలువలు లేవన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా, ప్రజలు సానుకూలంగా స్పందించారని, డబుల్ డిజిట్‌తో విజయకేతనం ఎగురవేస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.
బీజేపీని ఏ విధంగా ఆదరించబోతున్నారో లోక్ సభ ఎన్నికలో చూడబోతున్నారు. కేసీఆర్ పాలనపై విసిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమర్ధించారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అగస్ట్‌కు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలి. పాత రుణాలు చెల్లించక పోవడంతో కొత్త రుణాలను బ్యాంకులు ఇవ్వడం లేదని, రైతులు వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో సీఎం రేవంత్ చెప్పాలి.
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది, 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో చెప్పాలి. తెలంగాణలో 80 శాతం దొడ్డు బియ్యం ను రైతులు పండిస్తారు. బాయిల్ రైలి కొనేందుకు మోదీ ముందుకొచ్చారు. వచ్చే సీజన్‌కు బోనస్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. బీబఆర్ఎస్ సమాధి కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల పాలన గగనం.
ఎకరానికి 15 వేలు, కౌలు రైతుకు 12 వేలు.. ధాన్యం బోనస్ పైన 500 వందలు ఇస్తానని చెప్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది. ఆరు గ్యారంటీలలో బోనస్ కూడా ఒకటి అని సోనియాగాంధీ ప్రకటించింది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. మహిళలకు 2,500,నిరుద్యోగుల 4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఓట్లు వేయించుకున్నారు. విద్యార్థుల కు 5 లక్షల గ్యారంటీ కార్డు కు అతిగతి లేకుండా పోయింది. ప్రశ్నించేందుకు బిజెపి పార్టీ కి ఓటు వేయాలి. పట్టభద్రులు ఆలోచించి బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment