ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Sakshi
Sakshi News home page

థియేటర్‌లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

Published Fri, Aug 25 2023 10:12 AM

Bro, Baby, Slumdog Husband, Pizza 3 Streaming On These OTT Platform - Sakshi

సినిమావాళ్లకు శుక్రవారం సెంటిమెంట్‌ ఎక్కువ. చాలామంది ప్రత్యేకంగా ఈరోజే చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆరోజు రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్న సరే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికో, ప్రీపోన్‌ చేసుకోవడానికో ఇష్టపడరు. కచ్చితంగా ఫ్రైడేనే విడుదల చేస్తామంటారు. అలా ఈ రోజు(ఆగస్టు 25న) గాండీవధారి అర్జున, బెదురులంక 2012, బాయ్స్‌ హాస్టల్‌(డబ్బింగ్‌) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో గాండీవధారి అర్జునకు మిశ్రమ స్పందన లభిస్తుండగా బెదురులంక 2012, బాయ్స్‌ హాస్టల్‌ చిత్రాలకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది.

థియేటర్‌కు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో కూడా కొత్త చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బింగ్‌ మూవీతో కలుపుకుని నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల బ్రో మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అటు స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రసారమవుతోంది. బేబి మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పిజ్జా 3: ద మమ్మీ సైతం ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

పిజ్జా 3 మూవీ థియేటర్లలో విడుదలై కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. తెలుగులో డబ్‌ అయిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. కలెక్షన్స్‌ కూడా రాలేదు. దీంతో వారం రోజులకే దీన్ని ఓటీటీలోకి తెచ్చేశారు. మీరు కూడా పైవాటిలో నచ్చిన మూవీని సెలక్ట్‌ చేసుకుని ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి..

చదవండి: వరుణ్‌ తేజ్‌ సినిమాకు షాకింగ్‌ టాక్‌.. ఫస్టాఫ్‌ కన్నా సెకండాఫ్‌..
‘బెదురులంక 2012’మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
 
Advertisement