విడాకులైతే కలిసి ఉండొద్దా.. మాదంతా ఒకే కుటుంబం: ఆమిర్‌ మాజీ భార్య | Sakshi
Sakshi News home page

Kiran Rao: ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్‌ ఎలా ఉందంటే?

Published Sat, Feb 3 2024 3:40 PM

Kiran Rao About Her Bond With Aamir Khan, His First Wife Reena Dutta - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ పెళ్లి ఇటీవలే ఘనంగా జరిగింది. కూతురు ఇష్టపడ్డవాడితోనే దగ్గరుండి పెళ్లి జరిపించాడు ఆమిర్‌. ఈ వివాహ వేడుకకు అతడి మాజీ భార్యలు రీనా దత్తా(ఇరా ఖాన్‌ తల్లి), కిరణ్‌ రావు హాజరై సందడి చేశారు. అంతా ఒకే కుటుంబంలా కనిపించి కనువిందు చేశారు. తాజాగా కిరణ్‌.. ఆమిర్‌, రీనాలతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 'నేను జనాలను ఈజీగా కలుపుకుపోతాను. నా కుటుంబం కూడా ఇరా పెళ్లికి హాజరైంది.

అందరం కలిసే ఉంటాం..
దీని గురించి మనం మరీ లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. మేమంతా ఒక కుటుంబం. మేము ఒక్కచోటకు చేరినప్పుడల్లా అంతా కలిసే భోజనం చేస్తుంటాం. అలాగే ఒకేచోట నివసిస్తుంటాం. మా అత్తయ్య పై ఫ్లోర్‌లో ఉంటుంది. తనంటే నాకెంతో ఇష్టం. రీనా పక్కింట్లో ఉంటుంది. ఆమిర్‌ కజిన్‌ నుజత్‌ కూడా దగ్గర్లోనే ఉంటుంది. మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం. అందుకే ఇలా కలిసుంటాం. రీనా, నుజత్‌తో బయట చక్కర్లు కొడుతుంటాను కూడా! ఆమిర్‌తో కూడా వెళ్తూ ఉంటాను.

పగప్రతీకారంతో విడాకులు తీసుకోలేదు
విడాకులైనంత మాత్రాన ఈ ప్రేమానుబంధాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. ఆమిర్‌, నేను పగ ప్రతీకారాలతో విడాకులు తీసుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా కలిసే ఉన్నాం. ఇలాంటి అనుబంధం లేకపోతే మనల్ని మనమే కోల్పోతాం' అని చెప్పుకొచ్చింది. కాగా ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌ రావు 2005లో పెళ్లి చేసుకున్నారు. సరోగసి ద్వారా 2011లో తనయుడు ఆజాద్‌ రావు జన్మించాడు. 2021లో వీరు విడాకులు తీసుకున్నారు.

చదవండి: నా సినిమా చూడండంటూ కన్నీళ్లు పెట్టుకున్న సోహైల్‌
బతికే ఉన్నానని ట్విస్ట్‌ ఇచ్చిన పూనమ్‌ పాండే.. ఇదంతా ఎందుకు చేసిందంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement