రక్తమోడుతున్న రహదారులు | Sakshi
Sakshi News home page

రక్తమోడుతున్న రహదారులు

Published Mon, May 6 2024 5:20 AM

రక్తమ

ఏటూరునాగారం: ఏజెన్సీ గ్రామాలు, రహదారులు ఇసుక లారీలతో రక్త మోడుతున్నాయి. జిల్లాలో రోజుకు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగి అమాయకులు మృత్యువాత పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో ఇసుక లారీల రవాణా కొనసాగుతోంది. రోడ్డు మీద ప్రయాణించాలంటే వాహనదారులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

నిబంధనలు నిల్‌

జిల్లాలో వన్యప్రాణుల సంచారం ఉన్నప్పటికీ రాత్రి వేళలో ఇసుక రవాణా చేయొద్దని నిబంధనలు ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాత్రి 9 దాటిన తర్వాత భారీ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే అనుమతి లేదు. కానీ ఇష్టానుసారంగా ఇసుక లారీలు చీమల వరుసను తలపించే విధంగా ఒకదాని వెనుక మరొకటి రోడ్డు పొడువునా గంటల తరబడి లారీలు ఉండడంతో ప్రయాణికులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. వాజేడు, వెంకటాపురం(కె), ఏటూరునాగారం, మంగపేట, పినపాక మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక లారీలు ఇటు బూర్గంపాడు– ఏటూరునాగారం, 163 జాతీయ రహదారి ఛత్తీస్‌గఢ్‌ – ఏటూరునాగారం, వరంగల్‌– ఏటూరునాగారం రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు, లారీలు ప్రయాణిస్తున్నాయి. ఇక రాత్రి వేళలో ప్రయాణించాలంటే ఇంటి దగ్గర మళ్లీ వస్తానో రానో అని చెప్పి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇంత జరుగుతున్న స్థానిక, జిల్లా పోలీస్‌ అధికారులు, పరిపాలన అధికారులు సైతం వీటిపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీలు ఈ సమస్యలపై నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం కావడంతో శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు ప్రయాణికులు వెళ్లి వస్తుంటారు. ఈ సమయంలోనే ఇసుక లారీలు రహదారి పొడవునా విస్తరించి ఉండడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కార్లలో ప్రయాణించే వారు, ద్విచక్ర వాహనదారులు ఇసుక లారీ డ్రైవర్ల ఆగడాలకు బలైపోతున్నారు.

రాత్రి వేళ నివారించాలి

రాత్రి వేళలో ఇసుక లారీలను నివారించాలి. ఉద యం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్ర మే రవాణా జరిగేలా చూడాలి. పగలురాత్రి ఇసుక లారీలు నడుపుతుండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అమాయక ప్రజలు మృత్యువాతపడుతున్నారు. జిల్లా అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

– ఈసం రామ్మూర్తి,

ఏటూరునాగారం మాజీ సర్పంచ్‌

ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇసుక లారీలు

మద్యం మత్తులో లారీ డ్రైవర్లు

పట్టించుకోని పోలీసు అధికారులు

వారంలో నలుగురి మృతి

ఇసుకలారీలతో జిల్లాలో వారంలో నలుగురు మృతి చెందారు. గురువారం జీడివాగు వద్ద ఫొటోగ్రాఫర్‌ సాంబయ్యను ఇసుక లారీ బలి తీసుకుంది. ఏప్రిల్‌ 24న ఇదే జీడివాగు వద్ద సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అనిల్‌ సుర్వేసిని సైతం ఇసుక లారీ కబలించింది. తాడ్వాయి వద్ద ఏప్రిల్‌ 30న ములుగులో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాసి వస్తున్న క్రమంలో ఇసుక లారీలు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇసుక లారీల డ్రైవర్లు మద్యం సేవించి అతివేగంగా నడపడం, నిద్రలేని రాత్రులు గడపడం, విశ్రాంతి లేక అలసటతో లారీలు నడుపుతుండడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు లారీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇసుక లారీల డ్రైవర్లకు కావాల్సినంత విశ్రాంతి, మద్యం సేవించకుండా చర్యలు తీసుకుంటే ప్రమాదాల నివారణకు కొంతమేర అవకాశం ఉంటుందని అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం మేలుకొని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇసుక లారీలతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

రక్తమోడుతున్న రహదారులు
1/4

రక్తమోడుతున్న రహదారులు

రక్తమోడుతున్న రహదారులు
2/4

రక్తమోడుతున్న రహదారులు

రక్తమోడుతున్న రహదారులు
3/4

రక్తమోడుతున్న రహదారులు

రక్తమోడుతున్న రహదారులు
4/4

రక్తమోడుతున్న రహదారులు

Advertisement
Advertisement