రీసైక్లింగ్ అనేదిప్పుడు గృహాలంకరణలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది. కలపే కాదు ఫ్యాబ్రిక్ కూడా అందులో భాగమైంది. రీసైకిల్ వుడెన్ ఫర్నిచర్‌తోపాటు పాతకాలం వుడెన్ వస్తువులు కొద్దిపాటి మార్పుచేర్పులతో అద్భుతమైన షోపీసెస్‌గా అమరిపోతున్నాయి.
ఇంట్లోని రకరకాల ఫ్యాబ్రిక్స్ కూడా! పలు కళాత్మక రూపాలుగా కొలువుదీరి ఇంటి హోదాను.. విలువను పెంచుతున్నాయి. ఇలా రీసైక్లింగ్ మెటీరియల్‌తో విండో బ్లైండ్స్ నుంచి ఆరుబయట అలంకారాల వరకు ప్రతీదాంట్లోనూ మనదైన సృజనను చూపించవచ్చు.
విండోస్‌కి జూట్, ఆకులతో అల్లిన చాపలను ఉపయోగించవచ్చు. వెదురుతో చేసిన రకరకాల వస్తువులు, ఫర్నిచర్‌ను బాల్కనీలో అమర్చుకోవచ్చు. వీటివల్ల ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అనుభూతి కలుగుతుంది. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యామనే ఆనందమూ మిగులుతుంది.
ఇవి చదవండి: అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
Comments
Please login to add a commentAdd a comment