రూ. 55 వేలు పంట రుణం తీసుకున్నాను | Sakshi
Sakshi News home page

రూ. 55 వేలు పంట రుణం తీసుకున్నాను

Published Sat, Apr 20 2024 1:20 AM

కోవెలకుంట్ల స్టేట్‌బ్యాంకు - Sakshi

రబీసీజన్‌లో 1.50 ఎకరాల పొలంలో పప్పుశనగ సాగు చేశాను. గ్రామంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పెట్టుబడి కోసం పంట రుణానికి దరఖాస్తు చేసుకున్నాను. బ్యాంకు అధికారులు రూ. 55 వేలు పంట రుణం ఇచ్చారు. ఆ రుణంతో విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనుగోలు చేసి వ్యవసాయానికి వినియోగించున్నాను.

– రవికుమార్‌రెడ్డి, రైతు, ఉయ్యాలవాడ

పెట్టుబడికి

భయమే లేదు

నాకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని ఏటా జొన్న, పప్పుశనగ పంటలు సాగు చేస్తున్నాను. గతంలో పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా రూ. 13,500 పెట్టుబడిసాయం, బ్యాంకుల ద్వారా రుణాలు అంద జేస్తుండటంతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన అవసరం తప్పింది.

– సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్ల

1/2

2/2

Advertisement
Advertisement