పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం

Published Wed, May 8 2024 6:19 PM

Nirmala Sitharaman Fire On Sam Pitroda Racist Remarks

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాహుల్ గాంధీ మెంటర్ ఆలోచన, వైఖరిని వెల్లడిస్తుందని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ఇటీవల వారసత్వ పన్నుపై మాట్లాడి వివాదంలో చిక్కుకున్న ఆయన.. తాజాగా, జాత్యహంకార వ్యాఖ్యలతో తీవ్ర దుమారాన్ని రేపారు. పిట్రోడా  జాతి వివక్షకు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. నేను దక్షిణ భారతీయురాలిని. నేను భారతీయురాలిగా కనిపిస్తున్నాను అని అన్నారు.

కానీ రాహుల్ గాంధీకి గురువు పిట్రోడా జాత్యహంకారానికి మనమందరం ఆఫ్రికన్, చైనీస్, అరబ్, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నాము. మీ ఆలోచనా విధానాన్ని, మీ వైఖరిని వెల్లడించినందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు ఇండియా కూటమికే అవమానం అని మండ్డారు.  
కాగా, పిట్రోడా వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ ఖండించింది. ‘పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరం. ఆమోదయోగ్యం కాదు’ అని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు. 

 

Advertisement
 
Advertisement