గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి | Sakshi
Sakshi News home page

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి

Published Fri, Apr 19 2024 1:35 AM

ఆలూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు
కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ - Sakshi

● కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

సారంగపూర్‌: ప్రతీరోజు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాన కూడళ్లలో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌ ఆ దేశించారు. మండలంలోని చించోలి(బి), ఆలూరు, ధని గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రధాన రహదారులు, సీసీరోడ్ల నిర్మాణాలు, మురికి కాలువలు, పల్లె ప్రకృతివనం, నర్సరీ, పాఠశాలలను పరిశీలించారు. గ్రామాల్లోని ప్రధాన రహదారుల వెంట, కూడళ్లలో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీవో తిరుపతిరెడ్డిని ఆదేశించారు. వ్యాపారులు, దుకాణా ల నిర్వాహకులు బయట చెత్త వేయకుండా చూడాలన్నారు. ఎవరైనా చెత్తను బయట వేస్తే చర్య తీసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేయించి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా డంపింగ్‌ యార్డుకు తరలించాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన..

అనంతరం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సి బ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 40 కేజీ ల బస్తాలో 40.580 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వేయాలని సూచించారు. ఎండల తీవ్రత అ ధికంగా ఉన్న నేపథ్యంలో కేంద్రాల ఆవరణలో టెంట్లు వేయాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆలూరు పీఏసీఎస్‌ సీఈవో మల్లేశ్‌కు సూచించారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌, ఫోన్‌ నంబర్‌ తీసుకురావాలని తెలిపారు. నిబంధనల మేరకు ధాన్యం తేవాలని పేర్కొన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో

వేగం పెంచాలి..

ధని గ్రామంలోని పాఠశాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కేటాయించిన నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతులు పూర్తి చేయించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. విద్యుత్‌, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయతీ అధికారి గోవింద్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, తహశీల్దార్‌ శ్రీదేవి, అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement